ప్రాంతీయం

రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు

42 Views

సిద్దిపేట జిల్లా రాయపోలు మండల పరిధిలోని వివిధ గ్రామాలలో ఐకెపి కేంద్రాలను తాసిల్దార్ కృష్ణమోహన్, ఎంపీడీఓ జేమ్లా నాయక్, ఏపీఎం యాదగిరి సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మండల పరిధిలోని వివిధ గ్రామాలైన రాయపోల్, రాంసాగర్, అంకిరెడ్డిపల్లి, టెంకంపేట్, ఆరెపల్లి, వడ్డేపల్లి, అనాజీపూర్, మంతూర్, తిమ్మక్ పల్లి, చిన్న మసాన్ పల్లి, కొత్తపల్లి, ఎల్కల్ గ్రామాలలో ఐకెపి వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగిందన్నారు. రైతులకు ముఖ్యంగా వరి ధాన్యాన్ని దళారులను నమ్మి మోసపోకూడదని, వర్షాకాలం వరి పంట కోయగానే ఐకెపి కేంద్రాలకు తరలించాలని, కొనుగోలు సమయంలో నాణ్యత ప్రమాణాలను పాటించాలని సూచించారు. అంతేకాకుండా, ప్రభుత్వం వరి ధాన్యానికి ఏ గ్రేడ్ ధర రూ.2,389, బి గ్రేడ్ ధర రూ.2,369 కేటాయించడం జరిగిందని, రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ రాజమల్లు, సీనియర్ అసిస్టెంట్ ముత్తాలిఫ్ అలీ, ఏఈఓలు రజిత్, ప్రవీణ్, సీసీలు నాగరాజు, కుమార్, రోజా, అంజమ్మ, వివోఏలు మల్లేశం, నర్సింలు, సుభద్ర, నరేందర్ రెడ్డి, విజయ్, భాను, లావణ్య, రేణుక, బిక్షపతి, శోభ, మండల మహిళా కోశాధికారి సౌందర్య, సెంటర్ నిర్వాహకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *