ప్రాంతీయం

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి బాధాకరం -కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు పడాల రాములు 

159 Views

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి బాధాకరం -కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు పడాల రాములు

సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ డిసెంబర్ 27

భారతదేశం ఒక గొప్ప ఆర్థికవేత్తను కోల్పోయిందని దౌల్తాబాద్ మండల్ ,కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు పడాల రాములు,మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు బండారు లాలు,ఉపాధ్యక్షులు మద్దెల స్వామి, కాంగ్రెస్ సీనియర్ నేత కరుణాల శ్రీనివాసరావు, మాజీ సర్పంచ్ మల్లేశం, రాజు,మల్లారెడ్డి, సంపత్ రెడ్డి, ఇమ్రాన్, నరసింహులు, రమేష్, శ్రీనివాస్,రామస్వామి, వినోద్, కనకయ్య,తిమ్మకపల్లి మాజీ సర్పంచ్ కనకయ్య, మాట్లాడుతూ మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి బాధాకరం అని భారతదేశ గ్లోబల్ మార్కెట్లో చేర్చడానికి విశేషంగా కృషి చేశారని, వారు తీసుకున్న నిర్ణయాల వల్ల, ఆర్థిక వ్యవస్థ నిలబడిందని, ఆర్థిక సంస్కరణలు పితామహుడు మన్మోహన్ సింగ్ ను ప్రజలు మరువరు అని ఒక గొప్ప నాయకున్ని దేశం కోల్పోయింది అని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు, మన్మోహన్ సింగ్ హయాంలో విప్లవత్మకమైన సమాచార హక్కు చట్టం, ఉపాధి హామీ పథకం, తీసుకు వచ్చిన ఘనత వారిదే అని, యువతకు స్ఫూర్తి మన్మోహన్ సింగ్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్