Breaking News

మంఛిర్యాల సీజీఎస్టీ విభాగం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం

18 Views

మంఛిర్యాల సీజీఎస్టీ విభాగం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం

మంచిర్యాల జిల్లా.

మంఛిర్యాల సెంట్రల్ జీఎస్టీ విభాగాధికారి శ్రీ టి. వి. రమణా రెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్స్, మంఛిర్యాల డివిజన్ ఆధ్వర్యంలో, సూపరింటెండెంట్ అమన్ రాజ్, ఇన్స్పెక్టర్ వసంత్ మరియు మంఛిర్యాల డివిజన్ పరిధిలోని రేంజ్ అధికారులతో కలిసి ఈరోజు ఒక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం వీ కన్వెన్షన్వ లో జరిగింది.

ఈ కార్యక్రమం ఉద్దేశ్యం 22.09.2025 తరువాత కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మార్పులపై వ్యాపార వర్గాలకు అవగాహన కల్పించడం. ఈ సందర్భంగా మంఛిర్యాల చాంబర్ ఆఫ్ కామర్స్ మరియు ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

కార్యక్రమాన్ని అసిస్టెంట్ కమిషనర్ శ్రీ రమణా రెడ్డి ప్రారంభ ప్రసంగంతో ఆరంభించగా, అనంతరం జీఎస్టీ అధికారుల బృందం “జీఎస్టీ రీఫార్మ్స్ 2.0” కింద ప్రభుత్వం తీసుకువచ్చిన ముఖ్యమైన మార్పులపై సంక్షిప్త ప్రదర్శనలు ఇచ్చారు. తరువాత అధికారులు వ్యాపారవేత్తల ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ, విభాగం ఎల్లప్పుడూ వ్యాపార వర్గాల సహాయానికి సిద్ధంగా ఉంటుందని హామీ ఇచ్చారు.

వ్యాపారులు మరియు పన్ను నిపుణులు అధికారులతో చర్చలు జరిపి, అనేక సందేహాలను నివృత్తి చేసుకున్నారు. కార్యక్రమం ముగింపులో మంఛిర్యాల చాంబర్ ఆఫ్ కామర్స్ మరియు ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ వారు అసిస్టెంట్ కమిషనర్ ని సన్మానించారు.

కార్యక్రమం చివరగా సూపరింటెండెంట్ శ్రీ అమన్ రాజ్ కృతజ్ఞతా సభతో ముగిసింది.

No Slide Found In Slider.

Poll not found
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *