ఎన్డీయే ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ మూడో సారి ప్రధాన మంత్రిగా ఈ రోజు రాత్రి 7.30 ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలో ప్రమాణ స్వీకారోత్సవానికి ముందు కాబోయే ప్రధాని నరేంద్ర మోదీ తన కేబినెట్ మంత్రులు, ఎంపీలకు మోడీ తేనీటి విందు ఏర్పాటు చేశారు. అలాగే రాజ్ నాథ్ సింగ్, నితిన్ గడ్కరీలతో సహా మోడీ 3.0 క్యాబినెట్లో కొత్తగా మంత్రి పదవులు వచ్చిన వారికి ఇప్పటికే పీఎంవో ఆఫీస్ నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయి..
అలాగే తెలంగాణ నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మరోసారి చోటు దక్కగా, తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కు కేంద్ర కేబినెట్ లో చోటు దక్కినట్లు ఆయనకు ఫోన్ కాల్ చేశారు.
కాగా ఈ రోజు ప్రధాని మోడీతో పాటు బండి సంజయ్ ఢిల్లీలో కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే వారికి ఏ శాఖలు కేటాయించారనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.