ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు నివాసంలో ప్రాతికేయుల సమావేశం
మంచిర్యాల నియోజకవర్గం.
మంచిర్యాల పట్టణంలోని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు నివాసంలో ప్రాతికేయుల సమావేశం నిర్వహించిన మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు.
ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కీ,,శే శ్రీ కొక్కిరాల రఘుపతి రావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మంచిర్యాల నియోజకవర్గంలో ఉన్న ఆడపడుచులందరికీ బతుకమ్మ పండుగకు చీరాలు ఇవ్వడం జరిగింది. కానీ ఈ సంవత్సరం ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అనారోగ్యానికి గురి కావడంతో బతుకమ్మ పండుగకు ఇచ్చే చీరాలు నవంబర్ నెలలో 27తేదీ తర్వాత ఇస్తామని చెప్పారు. కావున మంచిర్యాల నియోజకవర్గం ఆడపడుచులందరూ సహకరించాలని కోరారు.
ఇటీవల కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన ఓటు చోర్ కార్యక్రమంలో భాగంగా మన మంచిర్యాల నియోజకవర్గంలో దాదాపు 1,50,000 వేల ఓట్ల సంతకాల సేకరణ చేస్తామని చెప్పారు.
అనంతరం మంచిర్యాల జిల్లా ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో తాజా మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, మహిళా నాయకురాలు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.





