Breaking News

రాంనగర్ హత్యయత్నం కేసు చెదించిన గోదావరిఖని 1 టౌన్ పోలీసులు

37 Views

*రామగుండం పోలీస్ కమీషనరేట్*

*రాంనగర్ హత్యయత్నం కేసు చెదించిన గోదావరిఖని 1 టౌన్ పోలీసులు*

గోదావరిఖని 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోదండరామాలయ సమీపంలోని సింగరేణి క్వార్టర్లో ఆర్ఎఫ్సీఎల్ అవుట్ సోర్సింగ్, ఫిజీషియన్ అసిస్టెంట్ అయిన యశ్వంత్ పై తేది :07-01-2025 న హత్యాయత్నం జరిగింది అని ఇంటి వెనుక నుంచి ఇంట్లోకి చొరబడిన గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో అతని గుర్తు తెలియని వ్యక్తులుతల, ముఖంపై దాడి చేశారు. అని అతని భార్య ప్రతిమ పిర్యాదు మేరకు గోదావరిఖని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు ను గోదావరిఖని ఏసీపీ రమేష్ ఆధ్వ ర్యంలో వన్డేన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, క్రైం టీమ్ వివిధ కోణాల్లో విచారణ జరిపారు. పలు కోణాల్లో విశ్లేషించిన పోలీసులు కుటుంబ సభ్యులు, బంధువులను విచారించారు. యశ్వంత్ ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలో నిందితుడి ముఖం రికార్డు కావడంతో దాని ఆధారంగా విచారణ చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా ప్రధాన నిందితుడు కన్నం ఛత్రపతి నీ ఇంటి వద్ద అదుపులోకి తీసుకోని విచారించగ ఇట్టి నేరంలో పాలుపంచుకున్న మిగతా నిందితుల వివరాలను తెలుపడం జరిగింది నిందితుని సమాచారం మేరకు మిగతా వారిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ తరలించి ఈరోజు వారిని అరెస్టు చేసి రిమాండ్ కి తరలించడం జరుగుతుందని గోదావరిఖని వంటకం ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి తెలిపారు

*నలుగురు నిందితుల అరెస్ట్…*

*నిందితుల వివరాలు*

1. కన్నం ఛత్రపతి s/o శ్రీనివాస్, 20yrs, స్టూడెంట్, విఠల్ నగర్, గోదావరిఖని.

2.నల్లగుల ప్రసాద్ @ సన్నీ s/o సదయ్య, 20yrs,విఠల్ నగర్, గోదావరిఖని

3.అనవేని సాయి తేజ @ బచ్చలి చింటూ s/o నారాయణ, 26yrs, కార్ డ్రైవర్, రాం నగర్, గోదావరిఖని

4.కన్నం సంధ్య w/o శ్రీనివాస్, కాంట్రాక్టు బేస్డ్ నర్స్, సింగరేణి ఏరియా, హాస్పిటల్, విఠల్ నగర్, గోదావరిఖని. *(పరారిలో ఉన్నది)*

*స్వాధీనం చేసుకొన్నా వాటి వివరాలు*

కత్తి

03 సెల్ ఫోన్ లు

*వివరాల్లోకి వెళితే….*

నిందితుడు కన్నం చత్రపతి S/o శ్రీనివాస్, age. 20yrs, కులం. Sc మాదిగ, occu : విద్యార్థి, నిందితుడు తల్లి కన్నం సంధ్య సింగరేణి హాస్పిటల్ నందు కాంట్రాక్టు పద్ధతిలో స్టాఫ్ నర్స్ గా పని చేస్తుంది. సంధ్య హాస్పిటల్ నందు పనిచేసే క్రమంలో అక్కడే పని చేస్తున్నటువంటి మాడుగుల నాగరాజు, మాడుగుల దేవి అనే వ్యక్తులు హాస్పిటల్ లో పేషెంట్స్ కి డైపర్స్ మార్చే పనిలో పనిచేస్తుంటారు.

మాడుగుల నాగరాజు,మాడుగుల దేవి స్, సంధ్య వద్దకు వచ్చి బెడ్ కి పరిమితమైన పేషంట్స్ ఉంటారు. వారికీ చికిత్స చేయుటకు పని చేస్తారని అడగగా యశ్వంత్ వద్ద DN హోమ్ కేర్ సర్వీస్ నడిపే వ్యక్తి అదిక డబ్బులు తీసుకుని మీకు తక్కువ డబ్బులు ఇస్తూ పని చేయిoచుకుంటున్నాడు. అలాంటి వ్యక్తి వద్ద నేను పని చేయలేను అని చెప్ప గా సంధ్య మాట్లాడిన మాటలు నాగరాజు, భార్య దేవి యశ్వంత్ కి చెప్పగా యశ్వంత్ రెండు మూడుసార్లు అసభ్య పదజాలంతో తిడుతూ, వేరే వ్యక్తులతో అక్రమ సంబంధాలు అంట కట్టినడని బాధపడి ఈ విషయం నిందితుడు ఛత్రపతి కి వచ్చి చెప్పుకోగా నిందితుడు ఛత్రపతి బాధపడి తన స్నేహితులైనటువంటి అనవేన సాయి తేజ @ చింటూ, నల్లంగుల ప్రసాద్@సన్నీ అనే వ్యక్తులకు చెప్పుకొని బాధపడి యశ్వంత్ నీ ఏదైనా చేస్తే గాని నా పగ చల్లారాదు అని స్నేహితులకు చెప్పి, వాళ్లని కూడా నాకు సహకరించమని చెప్పగా వారు ఒప్పుకున్నారు.

తేదీ 7-01-2025 రోజున అందాద ఉదయం 11:00గంటల నుండి 12:30 గంటల సమయం లో ఛత్రపతి, నా తల్లి, అనవేణి సాయి తేజ @ చింటూ, నల్లంగుల ప్రసాద్ @ సన్నీ అందరం కలిసి యశ్వంత్ పై దాడి చేద్దామని ప్లాన్ చేసుకొని ఇంటి లోపలికి వెనుక గోడ దూకి వెళ్లారు. తల్లిని తిట్టాడు అనే కోపం ఛత్రపతి కత్తితో ఆర్ఎంపి యశ్వంత్ పైన విచక్షణ రహితంగా ముఖం పైన, తల పైన నరుకగా యశ్వంత్ అక్కడే కింద పడిపోయినాడు.

అనంతరం అందరు ఇంటి వెనకాల ఉన్న గోడదూకి వెనుక నుండి సులబ్ కాంప్లెక్స్ రోడ్ రాంనగర్ నుండి ఇంటికి వెళ్లినారు. అనంతరం పోలీసువారికి దొరకకుండా తప్పించుకు తిరుగుతున్నాడు.

నిందితులను చాకచక్యంగా పట్టుకోవడానికి కృషిచేసిన క్రైమ్ కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ రమేష్ సదానందం శ్రీనివాస్ కానిస్టేబుళ్లు రమేష్ మధుకర్ శ్రీనివాస్లను సీఐ అభినందించారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *