గ్రామ సమస్యలను పరిష్కరించాలని గ్రామ సభలో ఆందోళన
ఫిబ్రవరి 15
సిద్దిపేట జిల్లా చేర్యాల మండల పరిధిలోని పోతిరెడ్డిపల్లి గ్రామంలో గ్రామ సమస్యలను వెంటనే పరిష్కరించాలని గ్రామసభలో కత్తుల భాస్కర్ రెడ్డి ఆందోళన చేసాడు ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామంలో స్మశాన వాటిక సమస్యలకు నిలయంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు అంతేగాక గ్రామంలో వీధి దీపాలు వెలుగక రాత్రి వేళలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అలాగే డ్రైనేజీ సమస్య ఎక్కువగా ఉందని వెంటనే పరిష్కరించాలని బ్లీచింగ్ పౌడర్ చల్లి దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని లేకపోతే దీని ద్వారా మలేరియా, టైఫాయిడ్ వ్యాధులు ప్రబలించే అవకాశం ఉందని అన్నారు వెంటనే గ్రామ సమస్యలను పరిష్కరించాలని స్పెషల్ ఆఫీసర్ మొగిలిపల్లి నరసింహారెడ్డి, పంచాయతీ కార్యదర్శి ని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సిబ్బంది అలాగే గ్రామ ప్రజలు పాల్గొన్నారు
