Breaking News

సైబర్ వారియర్స్ తో సమావేశం నిర్వహించిన సిపి

25 Views

*రామగుండం పోలీస్ కమీషనరేట్*

సైబర్ వారియర్స్ తో సమావేశం నిర్వహించిన సిపి

*సైబర్ వారియర్స్ ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి : పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా*

రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఈరోజురామగుండం పోలీస్ కమిషనర్ పరిధిలోని పోలీస్ స్టేషన్లో సైబర్ వారియర్స్ తో రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సైబర్ వారియర్స్ సిబ్బందితో సమావేశం నిర్వహించడం జరిగింది. TGCSB హైదరాబాద్ వారు పంపించిన టీ షర్ట్ లను సైబర్ వారియర్స్ కి అందజేశారు.

ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ… సైబర్ వారియర్స్ గా పని చేస్తున్నటువంటి వారి పనితీరు గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుత కాలంలో సైబర్ నేరాలు వేగంగా పెరుగుతున్న క్రమంలో ప్రజలకు సైబర్ క్రైమ్ సెక్యూరిటీ పై అవగాహన కల్పించడం ఎంతో ముఖ్యమని మీమీ పోలీస్ స్టేషన్ ల పరిధిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రజలలో అవగాహన కల్పించాలి చైతన్య పరచాలని సూచించారు.సైబర్ వారియర్స్ కి అప్పగించిన బాధ్యత ని సక్రమంగా నిర్వహిస్తూ విధులలో ఎటువంటి నిర్లక్ష్యం లేకుండా ఇన్వెస్టిగేషన్ నిర్వహించి సైబర్ బాధితులకి న్యాయం చేసే విధంగా కృషి చేయాలనీ సీపీ  సూచించారు.

రామగుండము కమిషనరేట్ పరిధి లో ఇటీవల తేదీ:-13-09-2025 రోజున నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ లో భాగంగా మొత్తం 134 సైబర్ కేసులలో 41,81,824/- రూపాయలు బాధితులకు డబ్బులు వారి సంబంధిత అకౌంట్ లకు రిఫండ్ కావడం జరిగింది. లోక్ అదాలత్ సంబంధించి అధిక కేసులు రిఫండ్ అయ్యేలా కృషి చేసిన ఉత్తమ ప్రతిభ కనబర్చిన నలుగురు సైబర్ వారియర్ పోలీస్ కానిస్టేబుల్ లకు ప్రశంసా పత్రాలను ఇవ్వడం జరిగింది.

ఈ సమావేశం లో సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ N శ్రీనివాస్, CCPS ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి, సీసీ హరీష్, సైబర్ వారియర్స్ మరియు ఇతర పోలీస్ సిబ్బంది హాజరు అయ్యారు.

No Slide Found In Slider.

Poll not found
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *