రామగుండం.
రామగుండం లో జరిగిన వినాయక నిమజ్జనం సందర్భంగా దురదృష్టవశాత్తు గోదావరి నదిలో పడి ప్రాణాలు కోల్పోయిన రాజేష్ కుటుంబాన్ని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పరామర్శించారు.
ఈ సందర్భంగా ఎంపీ వంశీకృష్ణ కుటుంబ సభ్యులను ధైర్యం చెప్పి, వారి బాధలో తాను కూడా భాగమని తెలియజేశారు. మరణం ఎవరికీ పూడ్చలేని లోటు అయినా, ప్రభుత్వ సహాయం కోసం తాను కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
అలాగే ఇలాంటి విషాద ఘటనలు పునరావృతం కాకుండా నిమజ్జనాల సమయంలో రక్షణ చర్యలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని అధికారులను కోరారు.
కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.





