Breaking News

మంచిర్యాలలో మెగా రక్తదాన శిబిరం

22 Views

మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు జన్మదిన సందర్భంగా  మెగా రక్తదాన శిబిరం.

మంచిర్యాల నియోజకవర్గం..

ఈరోజు మంచిర్యాల పట్టణంలోని పద్మనాయక ఫంక్షన్ హాల్ లో మంచిర్యాల కార్పోరేషన్ , హాజీపూర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిర కార్యక్రమం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకురాలు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంచిర్యాల జిల్లా కలెక్టర్ శ్రీ కుమార్ దీపక్, దేవాపూర్ (అదానీ) ఓరియెంటెడ్ సిమెంట్ యూనియన్ అధ్యక్షులు, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సోదరుడు కొక్కిరాల సత్య పాల్ రావు పాల్గొని ప్రశంసా పత్రాలను అందజేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్  మాట్లాడుతూ ఇంత పెద్ద మంచి కార్యక్రమం చేపట్టిన మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కి అభినందనలు తెలిపారు.. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాల్గొని రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపిన దేవాపూర్ అదానీ ఓరియెంటెడ్ సిమెంట్ యూనియన్ అధ్యక్షులు, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సోదరుడు సత్య పాల్ రావు.

ఈ కార్యక్రమంలో తాజా మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, మహిళా నాయకురాలు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ,సత్య సాయి సేవా సమితి, తదితరులు పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *