తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలు
మంచిర్యాల జిల్లా.
ఈ రోజు తేదీ 17-9-2025 రోజున కాంగ్రెస్ డిసిసి అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ మంచిర్యాల జిల్లా కేంద్రంలోని తమ నివాసం వద్ద తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతోమంది ప్రాణలు త్యాగo చేయడం వల్లే తెలంగాణ ఏర్పడిందన్నారు. నిజాం నిరంకుశ పాలన ,రజాకారుల దౌర్జన్యాల నుండి సర్ధార్ వల్లభాయ్ పటేల్ భారత సైన్యంతో దాడి చేయడంతో నిజాం భారత ప్రభుత్వనికి లొంగిపోయి హైదరాబాద్ సంస్థనాన్ని 1948 సెప్టెంబర్ 17 వ తేదీన భారత్ లో విలీనం చేసారని అన్నారు. భాషయుత రాష్ట్రాలుగా ఆంధ్రాలో తెలంగాణను విలీనం చేసారని అప్పటి నుండే తెలంగాణ ఉద్యమం మొదలయిందని, సోనియా గాంధీ సహకారంతో తెలంగాణ సాధ్యమైందని తెలిపారు.





