అంతరిక్ష గ్రహ శకల నమూనాను సేకరించిన నాసా
సెప్టెంబర్ 25
భూమికి అత్యంత ప్రమాదకర బెెన్ను అనే పేరుగల గ్రహశకలము వైశాల్యము 500 మీటర్లు మాత్రమే..
ఈ గ్రహశకలము మన సౌర వ్యవస్థ పుట్టక ముందు నుండి ఉన్నట్లు అమెరికాకు చెందిన అంతరిక్ష సంస్థ నాసా తెలియజేసింది.
దీని యొక్క మట్టి నమూనా సేకరించినచో దానిపైన ప్రయోగాలు చేసినచో మన సౌర వ్యవస్థ ఏర్పడిన విధానము అలాగే మన భూమి పైన జీవం ఏర్పడిన విధానం గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో దాదాపుగా నాలుగు సంవత్సరాల క్రితం నాసా ఓసిరేస్ రెక్స్ అనే ఉపగ్రహాన్ని ప్రయోగించింది. .
ఆ ఉపగ్రహము రెండు సంవత్సరాల పాటు బెెన్ను చుట్టూ పరిభ్రమించి ఆ తరువాత ఐదు సెకండ్ల కాలంలో బెెన్ను గ్రహశకలం నుండి మట్టి నమూనాలను సేకరించింది. .
ఆ తరువాత అది తిరిగి ప్రయాణం కొనసాగించి భూమిపైకి చేరడానికి దాదాపు రెండు సంవత్సరాలు పట్టింది. .
అమెరికాలోని ఒక ఎడారిలో బెెన్ను గ్రహ శకల మట్టి నమూనాను సేకరించిన క్యాప్సూల్ సురక్షితంగా దిగడం జరిగింది. .
ఈ క్యాప్సుల్ ను నాసా అధికారులు స్వాధీనం చేసుకున్నారు దానిని మంగళవారం రోజు తెరచి అందులోని 250 గ్రాముల మట్టిని సేకరిస్తారు. .
దానిపైన ప్రపంచంలోని దాదాపుగా 200 మంది శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తారు. .
ఆ ప్రయోగాలలో సౌర వ్యవస్థ ఏర్పడటం మరియు భూమిపైన జీవం ఏర్పడిన విధానం గురించి ఫలితాలు తెలిసే అవకాశం ఉన్నదని నాసా వెల్లడించింది. .
