పెద్ద కొడప్గల్: మొక్క నాటిన ఎమ్మెల్యే
(కామారెడ్డి జిల్లా పెద్ద పెద్ద కొడప్గల్ మండల): పెద్ద కొడప్గల్ మండల కేంద్రంలోని బృహత్ పల్లె ప్రకృతి వనంలో శనివారం ఒక్క రోజు ఒక్క కోటి మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే హన్మంత్ షిండే మొక్కను నాటి నీరు పోసారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కచ్చితంగా మొక్కలు నాటి, పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలని సూచించారు. ప్రతి గ్రామంలో కచ్చితంగా మొక్కలు నాటేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, సిబ్బంది ఉన్నారు.





