మంచిర్యాల జిల్లా, చెన్నూరు.
కార్యకర్తల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నానని హామీ ఇచ్చిన మంత్రి వివేక్ వెంకటస్వామి.
చెన్నూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కోటపల్లి మండలానికి చెందిన గ్రామాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో మంత్రివర్యులు శ్రీ వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కార్యకర్తలు గ్రామాల్లో ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రజల అవసరాలు, అభివృద్ధి పనుల పురోగతి వంటి అంశాలను మంత్రివర్యుల దృష్టికి తీసుకువచ్చారు.
కార్యకర్తల ఆవేదనలను శ్రద్ధగా విన్న మంత్రి వివేక్ వెంకటస్వామి, వాటి పరిష్కారం కోసం తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పార్టీ బలోపేతానికి ప్రతి గ్రామంలో శక్తివంతమైన కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల అంచనాలకు అనుగుణంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వేగవంతం చేస్తుందని పేర్కొన్నారు.





