మంచిర్యాల జిల్లా.
వందే భారత్ రైలు హాల్టింగ్ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్. తరువాత మెగా రక్త దాన కార్యక్రమంలో పాల్గొన్నారు.
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా సేవ పక్షంలో భాగంగా ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలో M కన్వెన్షన్ హాల్ లో బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా రక్త దాన శిబిరాన్ని కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ రఘునాథ్ వెరబెల్లి , పట్టభద్రుల ఎమ్మెల్సీ అంజి రెడ్డి మరియు బీజేపీ నాయకులు పాల్గొన్నారు . ఈ సందర్భంగా పెద్ద ఎత్తున యువత రక్త దానం చేయడం జరిగింది.





