Breaking News

ప్రత్యేక సమావేశాలు

177 Views

రేపటి నుంచే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు..

సెప్టెంబర్ 17 న్యూఢిల్లీ

రేపుటి ( సోమవారం ) నుంచి పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు జరుగనుండగా ఒక రోజు ముందుగా నేడు (ఆదివారం) అన్ని పార్టీల ఫ్లోర్‌ లీడర్లతో కేంద్ర ప్రభుత్వం భేటీ కానుంది..

ఈ సెషన్స్ గురించి  వివరించి, అభిప్రాయాలు తీసుకోనున్నారు. ఐదు రోజుల సమావేశాల్లో మొదటిరోజు రాజ్యాంగ సభ మొదలుకొని 75 ఏళ్ల పార్లమెంట్‌ ప్రస్తానంపై ప్రత్యేక చర్చ కొనసాగుతుందని ప్రభుత్వం తెలిపింది..

ఇప్పటికే రాజ్యసభలో ప్రవేశ పెట్టిన ది అడ్వొకేట్స్‌(సవరణ)బిల్లు-2023, ది ప్రెస్‌ అండ్‌ రిజిస్ట్రేషన్ ఆఫ్‌ పీరియాడికల్స్‌ బిల్లు-2023, ది పోస్టాఫీస్‌ బిల్లు-2023లను ఈ సెషన్‌లో లోక్‌సభలో కేంద్ర సర్కార్ ప్రవేశ పెట్టనున్నట్లు ప్రకటించింది. ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించిన మార్పులతో గత సెషన్స్ లో రాజ్యసభలో ప్రవేశ పెట్టిన బిల్లును ఈసారి చర్చకు తీసుకురానుంది. అయితే, అనూహ్యంగా మరికొన్ని అంశాలను సైతం సభ ముందుకు తీసుకువచ్చే అవకాశాలున్నాయన్న చర్చ సర్వత్రా జోరుగా కొనసాగుతుంది..

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *