Breaking News

ఎమ్మెల్యే నివాసంలో పాత్రికేయ సమావేశం

29 Views

మంచిర్యాల జిల్లా.

తేదీ 11-09-2025 రోజున మంచిర్యాల శాసనసభ్యులు  కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు  నివాసంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో దర్ని మధు సింగల్ విండో డైరెక్టర్, తాళ్ల సంపత్ రెడ్డి గార్లు మాట్లాడుతూ ..
ఈ నెల 04/09/2025 తారీకు రోజున సుమారు రాత్రి 11 గంటల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీ కి అడ్డుగా కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీ కనపడకుండా మాజీ కౌన్సిలర్ బేర సత్యనారాయణ వినాయక నిమజ్జనం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీ కి అడ్డుగా బి ఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒక ఫ్లెక్సీ పెట్టడం జరిగింది, ఫ్లెక్సీ పెట్టిన కూడా నిమజ్జనం రోజు

నస్పూర్ లో ఎన్నడూ లేని విధంగా హిందూ ఉత్సవ సమితి కోరిక మేరకు గౌరవ శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారు హిందూ ఉత్సవ సమితి సమావేశానికి పర్మిషన్ ఇప్పించి వారి ఆధ్వర్యంలో వినాయక నిమజ్జన ఉత్సవం నిర్వహిస్తున్నందున ఇట్టి విషయం గ్రహించిన టిఆర్ఎస్ పార్టీ నాయకులు అల్లర్లు సృష్టించే కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీలకు అడ్డుగా టిఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీలు పెట్టి గొడవ చేయాలన్న ఆలోచన వారికి ఉన్నప్పటికీ గొడవ చేయకూడదు అని మేము ఆ ఫ్లెక్సీ ముట్టలేదు.

కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకులను రెచ్చగొట్టి అల్లర్లు సృష్టించడానికి కావాలని పనిగట్టుకొని బేర సత్యనారాయణ మరియు వారి అనుచరులు ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీ కి అడ్డుగా బిఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీ పెట్టడం జరిగింది.అయినా మేం సమయమనం పాటిస్తూ చూస్తూ ఊరుకున్నాము.

తేదీ 09/09/2025 రోజున రాత్రి సుమారు 7 నుండి 7:30 ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీ పూర్తిగా కనబడకూడదు అని మరొక ఫ్లెక్సీ ని బిఆర్ఎస్ పార్టీ నాయకులు బేర సత్యనారాయణ, ఆకుల సతీష్ వారి అనుచరులు మరొక ఫ్లెక్సీ పెట్టడానికి ప్రయత్నం చేస్తుండగా కాంగ్రెస్ పార్టీ నాయకులైన ధరణి మధుకర్, తాళ్ల సంపత్ రెడ్డి, మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్కడికి వెళ్లి బేర సత్యనారాయణ ను ఇది పద్ధతి కాదు మీ ఫ్లెక్సీలు తీసివేయండి , మా ఫ్లెక్సీలకు అడ్డుగా ఎందుకు పెడుతున్నారని ప్రశ్నించగా మాతో అక్కడికి వచ్చిన దళిత కార్యకర్తలపై ఇష్టం వచ్చిన పదజాలంతో నోటికి వచ్చిన బూతులు తిడుతూ నేను ఆ ఫ్లెక్సీలు తియ్యను మరొక ఫ్లెక్సీ పెడతాను మీరేం చేసుకుంటారో చేసుకోండి అని మమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు.అయినా కూడా మేమందరము సమయమనం పాటించి స్థానిక ఎస్సై కి అక్కడ జరిగినటువంటి విషయాన్ని తెలియపరిచాము. ఎస్ఐ ఆ సంఘటన స్థలానికి వచ్చేలోపు బిఆర్ఎస్ పార్టీ నాయకుడు బేర సత్యనారాయణ మరియు అతని అనుచరులు అక్కడ నుంచి వెళ్లిపోయారు.

ఈ విషయమై పూర్తి వివరాలు ఎస్ ఐ కి వివరించగా పోలీస్ స్టేషన్ కి వచ్చి పిటిషన్ ఇవ్వవలసిందిగా వారు చెప్పడం జరిగినది.
కాంగ్రెస్ పార్టీ నాయకులైన ధర్ని మధు మరియు దళిత కార్యకర్తలు అయిన కొంతమంది వ్యక్తులు పోలీస్ స్టేషన్ వెళ్లి ఫిర్యాదు ఇచ్చే సమయంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు బేర సత్యనారాయణ, కందుల ప్రశాంత్, కాటంరాజు, ఆకుల సతీష్, మరియు కొంతమంది కార్యకర్తలు పోలీస్ స్టేషన్ కి రావడం జరిగినది.
ఈ క్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ సురిమీళ్ళ వేణు,తాళ్ల సంపత్ రెడ్డి , అగల్ డ్యూటీ రాజు, పోలీస్ స్టేషన్ ఆవరణలో నుండి లోపలికి వచ్చే సమయంలో పైన తెలిపిన బి ఆర్ఎస్ వ్యక్తులు దళిత నాయకుడైన సురిమిళ్ళ వేణు ని ఇష్టం వచ్చిన పదజాలతో కులం పేరుతో దూషించి అవమానపరిచినారు.అధికార పార్టీలో ఉండి కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలమైన మేమందరం సమయమును పాటిస్తూ మా ఫ్లెక్సీ కి బి ఆర్ఎస్ కు చెందిన ఫ్లెక్సీ అడ్డము పెట్టినప్పటికీ మేము సైలెంట్ గా ఉంటే కావాలని రెచ్చగొడుతూ ఇష్టం వచ్చిన పదజాలతో కులం పేరుతో దూషించిన బేర సత్యనారాయణ, కందుల ప్రశాంత్, ఆకుల సతీష్, కాటంరాజు, మరియు కొంతమంది బి ఆర్ఎస్ పార్టీ నాయకులు వారే గొడవ సృష్టించి తిరిగి మా పైనే నిందలు వేయటం సరికాదు ఇట్టి విషయాన్ని ప్రజలు గమనించాల్సిందిగా కోరుచున్నాము.
అంతేకాకుండా గతంలో తేదీ 28/08/2016 రోజున ఎంపీపీ గా ఉన్న బేర సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాజీవ్ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీ ఉంటే ఆ ఫ్లెక్సీ కనబడకుండా టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన జెండాలు పెట్టడం జరిగినది ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులైన ధరణి మధుకర్. మరియు కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు జెండాల విషయమై ప్రశ్నించగా ఇష్టం వచ్చినట్టు తిడుతూ మాపై హత్యాయంత్రం కూడా చేయడం జరిగినది
ఇట్టి విషయమై పోలీస్ స్టేషన్ వెళ్లి పిర్యాదు చేయగా మా ఫిర్యాదును స్వీకరించకుండా మాపైనే తగు సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగినది.

ప్రశాంతంగా ఉన్న నస్పూర్ ప్రాంతంలో 2014 నుండి మొన్న జరిగినటువంటి సంఘటన వరకు బీ ఆర్ ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుల ఆగడాలు మితిమీరిపోయి రౌడీలుగా గుండాలుగా చలామణి చేస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకుల పై తరచూ దాడులు చేయడం అల్లర్లు సృష్టించడం కాంగ్రెస్ పార్టీ నాయకులను గాయపరచడం తిరిగి కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కేసులు నమోదు చేయించడం కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలు భయప్రాంతులను గురి చేయడం జరుగుతున్నది.
ఇలాంటి రౌడీలు ,గుండాలు బిఆర్ఎస్ పార్టీలో ఉన్నారు కాబట్టి మంచిర్యాల నియోజకవర్గంలో వాళ్లే గొడవలు సృష్టించి తిరిగి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పై నాయకులపై నిందలు వేస్తున్నారు. గౌరవ శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ రావు గారు చేస్తున్న అభివృద్ధి పనులు ఓర్వలేక ఎలాగైనా అల్లర్లు సృష్టించి బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారు అని అన్నారు.

ఈ కార్యక్రమంలో మంచిర్యాల పట్టణ అధ్యక్షులు తూముల నరేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పుదారి తిరుపతి, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు రావుల అనిల్, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు పెంట రజిత , మహిళా కాంగ్రెస్ బ్లాక్ అధ్యక్షురాలు బోయిని పద్మ, మాజీ మున్సిపల్ చైర్మన్ వసుంధర , మాజీ కౌన్సిలర్ మహేశ్వరి మరియు తదితర నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *