Breaking News

బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ కు అభినందన సభ

48 Views

బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ కు అభినందన సభ.

మంచిర్యాల జిల్లా.

భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా రఘునాథ్ వెరబెల్లి  నియామకం తరువాత మంచిర్యాల జిల్లాకు మొదటిసారి విచ్చేసిన సందర్భంగా బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ అధ్యక్షతన మొదటగా రఘునాథ్ కి జైపూర్ మండలం ఇందారం గోదావరి వంతెన వద్ద బీజేపీ శ్రేణులతో ఘన స్వాగతం ఒలకడం జరిగింది. అంతరం శ్రీరాంపూర్ బస్ స్టాండ్ వద్ద BMS నాయకులతో కలిసి సింగరేణి కార్మికుని విగ్రహానికి పూలమాల వేయడం జరిగింది. అనంతరం సీసీసీ కార్నర్ వద్ద బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికి ఏర్పాటు చేసిన బైక్ ర్యాలీ ద్వారా రఘునాథ్  మంచిర్యాల జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. మంచిర్యాల పట్టణం ఐబీ చౌరస్తాలో మొదటగా హనుమాన్ విగ్రహం వద్ద పూజలు చేసిన అనంతరం ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గోడెం నగేష్, ఆదిలాబాద్ శాసన సభ్యులు పాయల్ శంకర్ మరియు పెద్దపల్లి మాజీ పార్లమెంట్ సభ్యులు బోర్లకుంట వెంకటేష్ నేత తో కలిసి రఘునాథ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఎంపీ, ఎమ్మెల్యేలకు మరియు రఘునాథ్ కి బీజేపీ శ్రేణులు ఏర్పాటు చేసిన భారీ గజ పూలమాల తో స్వాగతం పలికారు. అనంతరం పట్టణ పురవీధుల్లో ర్యాలీ నిర్వహించి మంచిర్యాల పట్టణంలోని పద్మనాయక ఫంక్షన్ హాల్ లో రఘునాథ్ వెరబెల్లి కి ఏర్పాటు చేసిన అభినందన సభలో ఎంపీ గోడెం నగేష్ , ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, పాల్వాయి హరీష్ బాబు, మాజీ ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత , గోమాసే శ్రీనివాస్ మరియు జిల్లా నాయకులు పాల్గొన్నారు.

*ఎంపీ గడేం నగేష్  కామెంట్స్*…

1) ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి రాష్ట్ర ఉపాధ్యక్షుడు గా రఘునాథ్ ను నియమించడం చాలా అభినందనియం.

2) రాబోయే ఎన్నికల్లో మంచిర్యాల నియోజక వర్గంలో బీజేపీ జెండా ఎగురవేస్తాం..

3) భారత దేశానికి బిజెపి పార్టీ ఒక రక్షణ కవచంగా ఉంది.

4) బీజేపీ ప్రభుత్వం మన శత్రు దేశం అయిన పాకిస్తాన్ ను ప్రపంచ దేశాల ముందు దోషిగా నిలబెట్టింది.

5) ప్రజల కోరిక మేరకు కేంద్ర ప్రభుత్వం జిఎస్టీ స్లాబ్ నీ తగ్గించి ముందుకు వెళ్తుంది.

6) దేశంలో అలజడులు సృష్టించేందుకు కొన్ని శక్తులు పని చేస్తున్నాయి. దానిని అరికట్టేందుకు బిజెపి తీవ్రంగా కృషి చేస్తుంది.

7) పార్టీ కోసం పని చేసే ప్రతి కార్యకర్తను పార్టీ గుర్తించి సముచిత స్థానం కల్పిస్తుంది….

*ఎమ్మెల్యే పాయల్ శంకర్ కామెంట్స్:*

1) బీజేపీ కార్యకర్తల కృషి వల్లనే రాష్ట్రంలో ఎనిమిది ఎమ్మెల్యేలు మరియు ఎనిమిది ఎంపీ స్థానాల్లో బీజేపీ గెలుపు

2) పార్టీ కోసం కష్టపడిన వారికి పార్టీగుర్తించి తగిన ప్రాధాన్యం ఇస్తుంది

3) కాంగ్రెస్ పార్టీ అబద్ధపు హామీలతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి రాష్ట్రం ప్రజలను మోసం చేసింది

4) కేంద్ర ప్రభుత్వ నిధులతో రాష్ట్ర లో గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి

5) స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు భయపడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం

6) రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం

*ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు కామెంట్స్:*

1) కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే యూరియా కొరత

2) దళారులతో బ్లాక్ మార్కెట్ లో అధిక ధరలకు యూరియా విక్రయించి రైతులను దోచుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం

3) రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా రైతులను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

*రఘునాథ్ వెరబెల్లి  కామెంట్స్*…

1) ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బిజెపి పార్టీకి కంచుకోటగా మారింది.

2) త్వరలో జరిగే స్థానిక స్థంస్థల ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటుతుంది.

3) ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ను కషాయమయం చేసేందుకు కృషి చేస్తా, కార్యకర్తల పై అక్రమ కేసులు పెడితే సహించేది లేదు.

4) ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఒక్క ప్రభుత్వ ఇంజనీరింగ్ లేదు, దానిని సాధించేందుకు పోరాటం చేస్తా…

5) 250 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా చేసేందుకు ఐటీ పార్క్ పేరుతో కొత్త స్కీమ్ తీసుకువచ్చారు.

6) మంచిర్యాల ప్రాంతం అవినీతికి అడ్డగా మారింది.

7) త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచిర్యాల జిల్లాలో అన్ని స్థానాల్లో బీజేపీ విజయం ఖాయం

8) బీజేపీ కార్యకర్తల కృషి వల్లనే నాకు రాష్ట్ర ఉపాధ్యక్ష పదవి.. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో మూడు స్థానాల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి

8) బీజేపీ పోరాట ఫలితమే మంచిర్యాలలో వందే భారత రైలుకు హాల్టింగ్.. నేనే రైలు హాల్టింగ్ చేయించానని స్థానిక ఎంపీ చెప్పుకోవడం సిగ్గు చేటు

ఈ కార్యక్రమంలో గోనె శ్యామ్ సుందర్ రావు, కొయ్యల ఎమాజీ, ఆసిఫాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షులు ధోనీ శ్రీశైలం, పెద్దపల్లి పురుషోత్తం, మున్నా రాజా సిసోడియా, గాజుల ముఖేష్ గౌడ్, జోగుల శ్రీదేవి, ముత్తె సత్తయ్య, కమలాకర్ రావు, కోడి రమేష్, పట్టి వెంకట కృష్ణ, అక్కల రమేష్, వంగపల్లి వెంకటేశ్వర్ రావు, దుర్గం అశోక్, ఎనగందుల కృష్ణ మూర్తి, ఆకుల అశోక్ వర్ధన్, అందుగుల శ్రీనివాస్, పులగం తిరుపతి, వైద్య శ్రీధర్, రాచర్ల సంతోష్, ఉదయ శ్రీ, మంత్రి సురేఖ, మండల అధ్యక్షులు, నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *