రాష్ట్ర ఉపాది హామీ కౌన్సిల్ సభ్యులుగా శ్రీనివాస్ ముదిరాజ్
– శుభాకాంక్షలు తెలియజేసి ,నియామక పత్రాన్ని అందజేసిన మంత్రి హరీష్ రావు గారు..
– మంత్రి హరీష్ రావు గారికి కృతజ్ఞతలు తెలిపిన శ్రీనివాస్..
సిద్దిపేట అర్భన్ మండలం మిట్టపల్లి గ్రామానికి చెందిన సీనియర్ నాయకులు సిద్దిరబోయిన శ్రీనివాస్ ముదిరాజ్ ను రాష్ట్ర ఉపాది హామీ కౌన్సిల్ సభ్యులు గా నియమిస్తూ మంత్రి హరీష్ రావు గారు ప్రకటించారు, ఈ మేరకు నియామక పత్రాన్ని అందజేశారు, శుభాకాంక్షలు తెలిపారు.. దీనికి సీఎం చైర్మన్ గా ఉంటారు సభ్యులు గా ఇద్దరు ఉండగా అందులో మన సిద్దిపేట నియోజకవర్గం నుండి శ్రీనివాస్ ముదిరాజ్ ను నియమించారు.. మిట్టపల్లి గ్రామ సర్పంచ్ గా గ్రామ అభివృద్ధి లో ఆదర్శంగా నిలిచి జాతీయ స్థాయి లో గ్రామాన్ని నిలిపారు అని, సినీయర్ నాయకునిగా గుర్తిస్తు బాధ్యత లు అప్పగించారు.. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు గారికి శ్రీనివాస్ దంపతులు కృతజ్ఞతలు తెలిపారు.. తనకు అప్పగించిన బాధ్యత ను సమర్థవంతంగా నిర్వహిస్తానని శ్రీనివాస్ చెప్పారు..
