Breaking News

13న జాతీయ లోక్ అదాలత్ – కమిషనర్

41 Views

రామగుండం పోలీస్ కమీషనరెట్

13న జాతీయ లోక్ అదాలత్…కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలి.

లోక్ అదాలత్ ద్వారా సత్వర న్యాయం జరుగుతుంది.

రాజీ పడితే ఇద్దరు గెలిచినట్లే.. : పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఐపిఎస్.,

రాజీమార్గం రాజమార్గమని, కక్షలు, కార్పణ్యాలతో ఏమీ సాధించలేమని, రాజీపడితే ఇద్దరూ గెలిచినట్లేనని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. ఈ మేరకు ఈరోజు పత్రికా ప్రకటనను విడుదల చేశారు. ఈ నెల 13వ తేదీన జరుగనున్న జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. లోక్ అదాలత్ ద్వారా సత్వర న్యాయం జరుగుతుందని తెలిపారు. రాజీపడదగిన కేసులలో క్రిమినల్ కంపౌండ బుల్ కేసులు, సివిల్ తగాదా కేసులు, ఆస్తి విభజన కేసులు, కుటుంబపరమైన నిర్వాహణ కేసులు, వైవాహిక జీవితానికి సంబంధించిన కేసులు, బ్యాంకు రికవరీ, టెలిఫోన్ రికవరీ కేసులు, విద్యుత్ చౌర్యం, చెక్ బౌన్స్ కేసులో, ఇతర రాజీ పడ్డ దగిన కేసుల్లో కక్షిదారులు రాజీ పడాలని సూచించారు. రాజీ మార్గం రాజ మార్గ మని చిన్న చిన్న కేసులతో కక్షలు పెంచుకుని కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయాన్ని, డబ్బులను వృథా చేసుకోవద్దని సూచించారు. జుడిషియల్ డిపార్ట్మెంట్ ఇచ్చిన అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. పోలీస్ అధికారులు కోర్టు విధులు నిర్వహించే కానిస్టేబుల్ లు పోలీస్ సిబ్బంది రాజీపడ్డ దగిన కేసులను లను గుర్తించి ఇరువర్గాల వారిని పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించి రాజీ పడేటట్లు అవగాహన కల్పించాలని సూచించారు. లోక్ అదాలత్ ద్వారా బాధితులకు సత్వరమే న్యాయం జరుగుతుందని పోలీస్ కమిషనర్ తెలిపారు.

No Slide Found In Slider.

Poll not found
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *