29 Views
- ప్రభుత్వ ఉద్యోగులకు పదవి విరమణలు సహజమేనని సీఈఓ రమేష్, డిపిఓ దేవకీ దేవిలు అన్నారు. రాయపోల్ మండల మండల ఎంపీడీవోగా విధులు నిర్వహించి పదవి విరమణ పొందిన పోతరాజు బాలయ్యకి రాయపోల్ మండల పరిధిలోని ఓ ప్రైవేట్ పంక్షన్ హాల్లో శనివారం సన్మాన కార్యక్రమ సభను ఏర్పాటు చేశారు. సభ అధ్యక్షులుగా మండల ప్రత్యేక అధికారి బాబు నాయక్ వ్యవహరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యోగులు పనిచేస్తున్నప్పుడు చేసిన సేవలే చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. ఎంపీడీవో వృత్తి అనేది ఎంతో గొప్పనైనది అన్నారు. ఎన్నో ఆటుపోట్లకు ఎదుర్కొని పంచాయతీరాజ్ వ్యవస్థలో ఎన్నో ఇబ్బందులున్నా వాటిని అన్నింటినీ ఎదుర్కొని గ్రామాల అభివృద్ధిలో తనవంతు పాత్ర పోసిస్తూ, ప్రభుత్వం అమలు చేసే అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు అందజేస్తూ ప్రజల మన్ననలు పొందిన గొప్ప వ్యక్తి బాలయ్య అని గుర్తు చేశారు. కేవలం సంవత్సరనర కాలంలోనే ఇంత మంది ఆప్యాయతలను సంపాదించుకోవడం గొప్ప విషయమన్నారు. రాయపోల్ మండలంలో స్టాఫ్ సిబ్బంది లేకపోయినప్పటికి బాధ్యతతో పనిచేసిన వ్యక్తన్నారు. బాలయ్య శేష జీవితాన్ని కుటుంబ సభ్యులతో సుఖసంతోషాలతో గడపాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రాయపొల్ మండల విద్యాధికారి సత్యనారాయణ రెడ్డి, మండల వ్యవసాయ అధికారి నరేష్, వైద్యాధికారి మహారాజ్, ఎంపీడీవోలు స్వర్ణలత, మచ్చెందర్, శ్రీనివాస్, మురళీధరన్ శర్మ, దిశా కమిటీ సభ్యులు రవీందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ అనిత శ్రీనివాస్, మాజీ జడ్పీటీసీ యాదగిరి, కో ఆప్షన్ సభ్యులు పర్వీజ్, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు వెంకటేశ్వర శర్మ, బిజెపి మండల పార్టీ అధ్యక్షులు మంకిడి స్వామి, మండల పరిధిలోని వివిధ గ్రామాల తాజా మాజీ సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు, ఎంపీడీవో కుటుంబ సభ్యులు, బంధువులు తదితరులు పాల్గొన్నారు.
No Slide Found In Slider.
Poll not found