బెల్లంపల్లిలో వికలాంగుల సమావేశానికి హాజరైన మందకృష్ణ
మంచిర్యాల జిల్లా, బెల్లంపల్లి.
తేదీ : 06/09/2025 రోజున
పద్మశ్రీ అవార్డు గ్రహీత,MRPS జాతీయ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ బెల్లంపల్లి నియోజకవర్గం లోని తాండూర్ మండల సుమంగళి ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన వికలాంగుల సమావేశానికి హాజరై అనంతరం బెల్లంపల్లి కాంగ్రెస్ నాయకులు TPCC రాష్ట్ర ప్రచార కమిటీ కన్వీనర్ నాతరీ స్వామి నివాసం కన్నాల లో భోజనం చేసి జైపూర్ సమావేశానికీ బయలుదేరారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మల్లారపు చిన్న రాజం, MRPS మంచిర్యాల జిల్లా ఇంచార్జ్ లింగంపల్లి శ్రీనివాస్, MRPS జిల్లా అధ్యక్షులు చెన్నూరి సమ్మయ్య, బెల్లంపల్లి పట్టణ అధ్యక్షులు రామగిరి మహేష్, ఆయిల్లా రామకృష్ణ తదితర నాయకుల పాల్గొన్నారు.





