కాంట్రాక్ట్ పద్ధతిలో వైద్యుల పోస్టుల భర్తీ.
తెలంగాణ వైద్య విధాన పరిషత్ జిల్లా పర్యవేక్షణ అధికారి అవినాష్ కుమార్ అరిశె
కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా.
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపతరుల్లో కాంట్రాక్ట్ పద్ధతిలో వైద్యుల పోస్టుల భర్తీ చేయనున్నట్లు తెలంగాణ వైద్య విధాన పరిషత్ జిల్లా పర్యవేక్షణ అధికారి అవినాష్ కుమార్ అరిశె శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.* జిల్లా పరిధిలోని సామజిక అస్పత్రులు సిర్పూర్ టౌన్, బెజ్జూర్, కాగజ్నగర్, తిర్యాని, వాంకిడి, జైనూర్ లో ఉన్నా కాస్ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్, పీడియాట్రిక్, జనరల్ మెడిసిన్, జనరల్ డ్యూటీ డాక్టర్ పోస్టులు కాంట్రాక్ట్ పద్ధతిన భర్తీ చేస్తున్నట్లు తెలిపారు. దీనికిగాను అభ్యర్థులకు ఈనెల 11న ఉదయం 10:30 గంటలకు వాక్-ఇన్ -ఇంటర్వ్యూ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు సంబంధిత ధ్రువపత్రములతో నేరుగా ఇంటర్వ్యూకి హాజరు కావాలని కోరినారు. స్పెషలిస్ట్ డాక్టర్లకు రూ.1 లక్ష , జనరల్ డాక్టర్లకు రూ.52351/- వేతనము చెల్లించనున్నారన్నారు.





