మంచిర్యాల జిల్లా.
గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుదాం..
స్థానిక సంస్థల ఎన్నికల బరిలో బీసీ పార్టీ.
యువత రాజకీయాల్లోకి రావాలి.
బిసిలను మోసం చేస్తున్న మూడు పార్టీలు.
బీసీ ద్రోహులకు ప్రజా క్షేత్రంలో ప్రజలే బుద్ధి చెబుతారు.
తెలంగాణ పొలిటికల్ బీసీ జేఏసీ మంచిర్యాల జిల్లా ఇంచార్జ్ మహేష్ వర్మ.
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బీసీ జేఏసీ కార్యాలయంలో బుధవారం రోజున తెలంగాణ పొలిటికల్ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికల మిషయంపై కీలక సమావేశం ఏర్పాటు చెయ్యడం జరిగింది. ఈ సమావేశంలో మంచిర్యాల జిల్లా ఇంచార్జి మహేష్ వర్మ మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలంగాణ పొలిటికల్ బీసీ జేఏసీ పోటీ చేస్తుందని తెలిపారు. తీన్మార్ మల్లన్న సారధ్యంలో బీసీ రాజ్యాధికారమే లక్ష్యంగా తెలంగాణ పొలిటికల్ బీసీ జేఏసీ ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు. ఎంపిటిసి, జెడ్పిటిసి, సర్పంచ్ లుగా పోటీ చేయాలని అనుకుంటున్న బీసీ, బహుజనుల అభ్యర్థులకు తీన్మార్ మల్లన్న తోడుగా ఉన్నారని, తెలంగాణ పొలిటికల్ బీసీ జేఏసీ అండగా ఉంటుందని స్పష్టం చేసారు. కాంగ్రెస్, బిజెపి, బిఆర్ఎస్ పార్టీలు బీసీలను, బహుజనులను మోసం చేస్తున్నాయని మండిపడ్డారు. గత కామారెడ్డి డిక్లరేషన్ లో భాగంగా బీసీలకు 42శాతం అన్నిరంగాల్లో అమలుచేస్తామని, 9వ షెడ్యూల్ లో పొందు పరుస్తామని హామీ ఇచ్చి కేవలం రాజకీయ లబ్ది కొరకే ఎన్నికల్లో వాటా ఇచ్చి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్, బిఆర్ఎస్, బిజెపి పార్టీలు కేవలం రాజకీయ లబ్ది పొందేందుకు మాత్రమే బీసీ వాదాన్ని వినిపిస్తున్నాయి తప్ప, బీసీల పట్ల ఎలాంటి చిత్తశుద్ధి లేదనే విషయాన్ని ఈ బీసీ సమాజం గమనిస్తుందని అన్నారు. ప్రజా క్షేత్రంలోనే ప్రజలు ఓటుతో మీకు బుద్ధి చెబుతారని అన్నారు. మంచిర్యాల జిల్లా ప్రజలు చైతన్యం అయ్యారని మీ కల్లబొల్లి మాటలు నమ్మే పరిస్థితి లేదని అన్నారు. తీన్మార్ మల్లన్న సారధ్యంలో మంచిర్యాల జిల్లాలో నూతన రాజకీయాలకు జీవం పోస్తామని స్పష్టం చేశారు. యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. కిరాయి పార్టీల జెండాలు మోసింది చాలని, మన జెండాను మాత్రమే మనం మోసుకొని, మన ఓట్లతోనే మన రాజ్యాధికారాన్ని మనం సాధించుకుందామని పిలుపునిచ్చారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుదామని, ఎన్నికల్లో పోటీచేసే ఆలోచన ఉన్న అభ్యర్థులు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని తెలంగాణ పొలిటికల్ బీసీ జేఏసీ కార్యాలయంలో మీ వివరాలను నమోదు చేసుకోవాలని తెలిపారు.
ఈ సమావేశంలో తెలంగాణ పొలిటికల్ బీసీ జేఏసీ జిల్లా నాయకులు పాకాల దినకర్, దాస్యపు దీపక్ , ఎల్తపు రాజశేఖర్, పడాల శివతేజ, సీపతి సాయికిరణ్, మహమ్మద్ లతీఫ్, కొత్తూరి సంతోష్, కుంట రాజేంద్రప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.





