రామగుండం పోలీస్ కమిషనరేట్
గణేష్ మండపాలను సందర్శించి పూజలు నిర్వహించిన పోలీస్ కమిషనర్
రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి జోన్ పెద్దపల్లి పట్టణ కేంద్రంలో పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గణేష్ మండపాలను రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా అధికారులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా సీపీ పెద్దపల్లి ప్రభుత్వం కళాశాల మైదానంలో వినాయక విగ్రహాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆనంతరం మండప నిర్వాహకులతో మాట్లాడిన కమీషనర్, నిమజ్జనం కార్యక్రమం గురించి అడిగి తెలుసుకున్నారు. మండపాల వద్ద శాంతిభద్రతల పరిస్థితిని సమీక్షించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించా రు. నిమజ్జనం రోజున ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను ఆదేశించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు సీపీని ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో పెద్దపెల్లి డీసీపీ కరుణాకర్, పెద్దపెల్లి ఏసి పి జి కృష్ణ , పెద్దపెల్లి సిఐ ప్రవీణ్ కుమార్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్ ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు.





