*రామగుండం పోలీస్ కమిషనరేట్*
*రేప్ మరియు పొక్సో కేసులో నేరస్తునికి జీవిత కాలం జైలు శిక్ష మరియు 21,000/- రూపాయల జరిమానా*
*పోలీస్ స్టేషన్ పోత్కపల్లి*
*నేరస్తుని వివరాలు*
శిలారపు రమేష్ s/o. రాజయ్య, వయస్సు: 38 సంవత్సరాలు, కులం : గొల్ల, R/o. ఉప్పరపల్లి.
కేసు యొక్క వివరాలు
ఓదెల మండలం కి చెందిన పిర్యాధిదారుని మనుమరాలు (భాధితురాలు మైనర్) ఎండాకాలం సెలవులు ఉన్నందున తన అమ్మమ్మ, తాతయ్య ఇంటికి వచ్చినాది తేదీ: 02/06/2022 రోజున భాధితురాలి అమ్మమ్మ తాతయ్యలు ఉపాధిహామీ పనికి రోజులాగే ఉదయము వెళ్లినారు ఆరోజు బాధితురాలు తన అమ్మమ్మ వాళ్ళ ఇంటి వెనకాల ఉన్న నిందితుడు రమేష్ యొక్క కొడుకులతో ఆడుకొనుచుండగా రమేష్ అన్నం తింటువు రా అని బాధితురాలిని ఇంటిలోకి పిలిచి బాధితురాలు ఇంటిలోకి రాగానే ముద్దాయి రమేష్ తలుపులు పెట్టి బాధితురాలని నోరు మూసి బలవంతంగా బలాత్కారం చేయగా బాధితురాలు వద్దు అని అంటుండగా వినకుండా బాధితురాలని రక్తం వచ్చేలాగా బలవంతంగా బలాత్కారం చేసినాడు, బాధితురాలికి రక్తం రావడం చూసిన ముద్దాయి అక్కడి నుంచి బాధితురాలని తన ఇంటిలోనుంచి వెళ్లిపొమ్మని చెప్పి తాను అక్కడి నుండి పారిపోయినాడు, అప్పుడు బాధితురాలు తన తాతయ్య అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి వారు ఉపాధి హామీ పని నుండి వచ్చిన తర్వాత వారికి విషయం చెప్పినాది
అని ఫిర్యాదుదారుడు తన మనమరాలను రక్తం వచ్చేలా పైశాచికంగా బలాత్కారం చేసిన ముద్దాయి రమేష్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయగా అప్పటి పోత్కపల్లి ఎస్ఐ లక్ష్మణ్ కేసు నమోదు చేసినారు. అప్పటి పెద్దపల్లి ఏసీపీ.S.సారంగపాణి పరిశోధన ప్రారంభించి బాధితురాలు యొక్క వాంగ్మూలాన్ని ఎస్ ఐ కె. మౌనిక పెద్దపల్లి చేత రికార్డు చేయించినారు మరియు ముద్దాయిని అదే రోజు పట్టుకొని అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్ కు పంపించినారు. తదుపరి నేర పరిశోధన పూర్తి చేసి కోర్టులో చార్జి షీట్ దాఖలు చేసినారు. Fast Track Special జడ్జి కోర్టు పెద్దపల్లి కోర్టులో కేసు విచారణ జరిగింది. గౌరవ కె. సునీత జడ్జి గారు ఇరువురి వాదనలు విని తదనంతరం నేరస్తుడు *శిలారపు రమేష్* నేరం చేసినట్లు ఋజువు కావడo వలన ముద్దాయికి జీవితకాలం కఠిన కారగారా జైలు శిక్ష మరియు 21,000/- రూపాయల జరిమానా విధించారు, మరియు గౌరవ జడ్జి బాధితురాలికి 5,00,000/- రూపాయలు కాంపెన్సేషన్ ఇప్పించాలని DLSA కి వ్రాసినారు.
నేరస్తునికి శిక్ష పడడానికి ముఖ్యపాత్ర వహించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్: బాదం రమేష్ సాక్షులను ప్రవేశపెట్టి తన వాదనలు వినిపించి నేరాన్ని రుజువు చేయడంలో కీలకపాత్ర పోషించారు.
పెద్దపల్లి డిసిపి. పి. కరుణాకర్ మరియు జి. కృష్ణ, ఏసీపీ పెద్దపల్లి గార్ల పర్యవేక్షణలో సాక్షులను ప్రవేశపెట్టడానికి, నిందితునికి శిక్ష పడేలా కృషి చేసిన సీఐ G. సుబ్బారెడ్డి సుల్తానాబాద్ గారు, ఎస్సై. దీకొండ రమేష్ గారు, కోర్ట్ కానిస్టేబుల్. P. శ్రీనివాస్, HC. 204, J. రాజు PC. 2332 మరియు ప్రాసిక్యూషన్ బృందాన్ని రామగుండం కమీషనర్ శ్రీ. అంబర్ కిషోర్ ఝా అభినందనలు తెలిపారు





