ఎల్లారెడ్డిపేట మండలం కోరుట్లపేట గ్రామంలో యూరియా కోసం రైతులు పడరాన్ని పాట్లు పడుతున్నారు. బుధవారం ఉదయం 6 గంటల నుండి పడిగాపులు కాసిన యూరియా మాత్రం రైతులకు అందడం లేదు. వరి నాట్లు వేసి నేలలు గడుస్తున్న ఒక్క యూరియా వస్తా కూడా తమకు అందలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఓ ఫర్టిలైజర్ షాపును ప్రారంభించినప్పటికీ యూరియా మాత్రం రైతులకు అందడం లేదని రైతులు వాపోతున్నారు.





