గణేష్ మండపాలపై పోలీస్ శాఖ కీలక ప్రకటన చేసింది. గణేష్ నవరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గణేష్ మండపాలు ఏర్పాటు చేసే వారికి పోలీస్ శాఖ కీలక ఆదేశాలు జారీచేసింది. వినాయక మండపాల ఏర్పాటుకు అనుమతుల కోసం సింగిల్ విండో విధానాన్ని తీసుకొచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. ganeshustav.net అనే వెబ్‌సైట్ లేదా 7995095800 నంబర్కు వాట్స్అప్ ద్వారా అనుమతి పొందాలన్నారు.





