Breaking News

సెప్టెంబర్ 17న జాతీయ సమైక్యతా దినోత్సవం.

69 Views

హైదరాబాద్ సెప్టెంబర్ 12: సెప్టెంబర్ 17న జాతీయ సమైక్యతా దినోత్సవం.

సెప్టెంబర్ 17న తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సోమవారం ఆదేశాలు జారీ చేశారు.

పబ్లిక్‌గార్డెన్స్‌లో జెండాను ఆవిష్కరించనున్న కేసీఆర్‌
జిల్లా కేంద్రాల్లో వేడుకల్లో పాల్గొననున్న మంత్రులు
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి
సెప్టెంబర్ 17న తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సోమవారం ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్‌ పబ్లిక్‌ గార్డెన్స్‌లో జరిగే ప్రధాన వేడుకల్లో సీఎం కేసీఆర్‌ జాతీయ జెండాను ఆవిష్కరిస్తారని పేర్కొన్నారు. అన్ని జిల్లా కేంద్రాల్లో జరిగే వేడుకల్లో అసెంబ్లీ స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్‌, మండలి చైర్మన్‌, డిప్యూటీ చైర్మన్‌, మంత్రులు, ప్రభుత్వ చీఫ్‌విప్‌, విప్‌లు, రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ జాతీయ జెండాను ఆవిష్కరిస్తారని తెలిపారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవవందనం స్వీకరిస్తారని తెలిపారు. ఆయా జిల్లా కేంద్రాల్లో ఆదివారం ఉదయం 9 గంటలకు జాతీయ జెండాను ఎగురవేయాలని పేర్కొన్నారు.

కోతుల బెడదపై సర్కారు దృష్టి
గ్రామాల్లో కోతుల బెడద నివారణపై ప్రభుత్వం దృష్టి సారించింది. సచివాలయంలో సోమవారం సీఎస్‌ శాంతికుమారి అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం జరిగింది. రాష్ట్రంలో పంటలను ధ్వంసం చేస్తున్న కోతుల నియంత్రణకు ప్రణాళికలు రూపొందించాలన్న హైకోర్టు సూచనలను ఈ సమావేశంలో సమీక్షించారు. తక్షణ, దీర్ఘకాలిక ప్రణాళికలను అధికారులకు నిపుణుల కమిటీ సభ్యులు వివరించారు. సమీక్షలో పీసీసీఎఫ్‌ ఆర్‌ఎం డోబ్రియాల్‌, పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌, పశుసంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధర్‌ సిన్హా, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రొనాల్డ్‌ రోస్‌ తదితరులు పాల్గొన్నారు.

జిల్లాల్లో జాతీయ జెండానుఆవిష్కరించనున్న ప్రముఖులు జిల్లా పేరు:

ఆదిలాబాద్‌ గంప గోవర్ధన్‌
కొత్తగూడెం రేగా కాంతారావు
జగిత్యాల కొప్పుల ఈశ్వర్‌
భూపాలపల్లి పల్లా రాజేశ్వర్‌రెడ్డి
జనగామ ఎర్రబెల్లి దయాకర్‌రావు
గద్వాల టీ పద్మారావు
కామారెడ్డి పోచారం శ్రీనివాస్‌రెడ్డి
ఖమ్మం పువ్వాడ అజయ్‌
కరీంనగర్‌ గంగుల కమలాకర్‌
అసిఫాబాద్‌ సుంకరి రాజు
మహబూబ్‌నగర్‌ వీ శ్రీనివాస్‌గౌడ్‌
మహబూబాబాద్‌ సత్యవతి రాథోడ్‌
మంచిర్యాల బాల్క సుమన్‌
మెదక్‌ తలసాని శ్రీనివాస్‌
మేడ్చల్‌ చామకూర మల్లారెడ్డి
ములుగు ఎమ్మెస్‌ ప్రభాకర్‌రావు
నాగర్‌ కర్నూలు గువ్వల బాలరాజు
నల్లగొండ గుత్తా సుఖేందర్‌రెడ్డి
నారాయణపేట వీ సునీతాలక్ష్మారెడ్డి
నిర్మల్‌ ఏ ఇంద్రకరణ్‌రెడ్డి
నిజామాబాద్‌ వేముల ప్రశాంత్‌రెడ్డి
పెద్దపల్లి టీ భాను ప్రసాద్‌రావు
సిరిసిల్ల కే తారక రామారావు
రంగారెడ్డి పీ సబితా ఇంద్రారెడ్డి
సంగారెడ్డి ఎండీ మహమూద్‌ అలీ
సిద్దిపేట టీ హరీశ్‌రావు
సూర్యాపేట జీ జగదీశ్‌రెడ్డి
వికారాబాద్‌ పట్నం మహేందర్‌రెడ్డి
వనపర్తి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
హనుమకొండ దాస్యం వినయ్‌భాస్కర్‌
వరంగల్‌ బండ ప్రకాశ్‌
భువనగిరి గొంగిడి సునీత

Oplus_131072
Oplus_131072
Linga Sunitha wargal

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *