
కిచెన్ షెడ్ నిర్మించాలి
కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
ఎల్లారెడ్దిపేట మండలం పోతిరెడ్డిపల్లి, వెంకటాపూర్ పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీ
విజన్ ఆంధ్ర ఎల్లారెడ్దిపేట, సెప్టెంబర్ – 02
విద్యార్థులకు మెనూ ప్రకారం పోషకాహారం అందించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. ఎల్లారెడ్దిపేట మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా స్కూల్ లో 25 మంది విద్యార్థులు ఉండగా, మరో విద్యా వాలంటీర్ ను నియమిచాలని ఆదేశించారు. పిల్లలకు మధ్యాహ్న భోజనంలో భాగంగా గోంగూర పచ్చడి మాత్రమే పెట్టడం కలెక్టర్ గమనించారు.
గ్రామంలో పలు కాలనీలలో అపరిశుభ్రంగా ఉన్న పరిసరాలు, చెత్తాచెదారం ఉండడాన్ని గమనించారు. గ్రామంలోని అన్ని వార్డుల్లో నిత్యం పారిశుధ్య పనులు చేయించాలని, పరిశుభ్రంగాస ఉంచాలని కలెక్టర్ ఆదేశించారు.ఈ సందర్భంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి స్కూళ్లో మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన పోషకాహారం అందించాలని మధ్యాహ్న భోజన నిర్వాహకులకు సూచించారు. స్కూల్ ఆవరణలో కిచెన్ షెడ్ ను నిర్మించాలని గ్రామ పంచాయతీ కార్యదర్శిని కలెక్టర్ ఆదేశించారు.
వెంకటాపూర్ ప్రభుత్వ పాఠశాల లో..ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామంలోని మండల ప్రజాపరిషత్ ప్రాథమిక, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా పాఠశాలలోని విద్యార్థుల హాజరు వివరాలు అటెండెన్స్ రిజిస్టర్ ప్రకారం తనిఖీ చేశారు.డిజిటల్ స్కూల్లో విద్యార్థుల సంఖ్య బెంచీల సంఖ్య తరగతి గదుల వివరాలు పలు అంశాలు సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులకు కలెక్టర్ మ్యాథ్స్ పాఠాలు బోధించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో యూనిఫామ్ లు విద్యార్థులకు పంపిణీ చేయాలని, కంప్యూటర్ ల్యాబ్ అందుబాటులోకి తీసుకురావాలని, గ్రీన్ బోర్డులు తరగతి గదుల్లో ఏర్పాటు చేయించాలని, ఆహార పదార్థాలు గ్యాస్ స్టౌ పైనే సిద్ధం చేయాలని సూచించారు.కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ సవేరా బేగం, సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.





