Breaking News

కూతురి సారీ ఫంక్షన్‌ ఘనంగా చేయలేదనిమనస్థాపంతో తల్లి ఆత్మహత్య

289 Views

కూతురి సారీ ఫంక్షన్‌ ఘనంగా చేయలేదనిమనస్థాపంతో తల్లి ఆత్మహత్య
గొల్లపల్లిలో ఘటన
తన కూతురు సారీ ఫంక్షన్‌ ఘనంగా చేయకుండా గృహ ప్రవేశంను ఘనంగా చేశాడని క్షణికావేశంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శనివారం జరిగినట్లు ఎస్ఐ రాహుల్‌రెడ్డి ఆదివారం తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం గొల్లపల్లికి చెందిన ఎనుగందుల భాస్కర్‌కు సిరిసిల్లకు చెందిన లావణ్యతో(40) 2010లో వివాహం జరిపించారు. వారికి కూతురు సాన్వి(13), కుమారుడు రిషిక్‌ జన్మించారు. ఇదే నెలలో జరిగిన సారీ ఫంక్షన్‌ ఘనంగా చెద్దామని లావణ్య తన భర్త భాస్కర్‌తో చెప్పగా నూతన గృహ ప్రవేశ కార్యక్రమం ఉన్నందున దాన్ని ఘనంగా చేద్దామని భార్యతో చెప్పాడు. సాన్వీ సారీ ఫంక్షన్‌ చిన్నగా చేసి గృహ ప్రవేశ కార్యక్రమాన్ని ఘనంగా జరిపించాడు. దీంతో మనస్థాపం చెందిన లావణ్య కుటుంబ సభ్యులతో మాట్లాడటం మానేసింది. భాస్కర్‌ శనివారం మద్యాహ్నం బోజనం చేసి ఎప్పటిలాగే తాను నిర్వహిస్తున్న దుకాణంకు వెల్లిపోయాడు. సాయంత్రం బడి నుంచి ఇంటికి వచ్చిన సాన్వీ, రిషిక్‌ తమ తల్లిదండ్రులుంటున్న గదికి తాళం వేసి ఉండటం చూసి పిలిచారు. ఎలాంటి స్పందన రాలేక పోవడంతో భాస్కర్‌కు సమాచారం అందివ్వగా ఇంటికి చేరుకున్నాడు. బయట నుంచి అద్దం పగులగొట్టి చూడగా అప్పటికే ఫ్యాన్‌కు ఉరేసుకుని వేలాడుతుంది. వెంటనే తలుపు గడియ తీసి లావణ్యను దింపేసరికే మృతి చెంది ఉంది. ఈ మేరకు మృతురాలి తల్లి నడిమెట్ల శ్యామల పోలీస్స్టేషన్‌లో ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాహుల్‌రెడ్డి తెలిపారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *