తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల రాష్ట్ర కమిటి సమావేశం సికింద్రాబాద్ లోనీ శ్రీ షిర్డీ సాయిబాబా ఉన్నత పాఠశాలలో జరిగినది. ఈ సమావేశానికి టీ జీ పీ ఏ వ్యవస్థాపక అధ్యక్షులు మోత్కూరి యాదన్న, రాష్ట్ర అధ్యక్షులు జాన్ కుమార్ లు ముఖ్య అథితులుగా పాల్గొన్నారు. గురుకులాలో చదువుతున్న పిల్లలకు మౌలిక సదుపాయాల విషయంలో, విద్య, ఆరోగ్యం, ఆహారం విషయంలో ముందడుగు వేసి సంఘ పటిష్టతకు కృషి చేయాలని తెలిపారు. అనంతరం రాష్ట్ర కమిటి విస్తరణలో భాగంగా .. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల పేరెంట్స్ కమిటీ (టీ జీ పీ ఏ) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా దుద్దెడ గ్రామానికి చెందిన చిట్యాల నర్సింలు ఎన్నికైనట్లు వ్యవస్థాపక అధ్యక్షులు మోత్కూరి యాదన్న, గౌరవ రాష్ట్ర అధ్యక్షులు జాన్ కుమార్. రాష్ట్ర అధ్యక్షులు రేగుంట లింగయ్య తెలియజేశారు. నూతన భాద్యులు సంస్థ బలోపేతానికి, ఆశయాల సాధనకు శక్తి వంచన లేకుండా కృషి చేయాలని ఈ సందర్భంగా వారికి సూచించడమైనది. ఈ సందర్భంగా పేరెంట్స్ కమిటీ కార్య నిర్వాహక అధ్యక్షుడిగా నియమితులైన చిట్యాల నరసింహులు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉన్న టీఎస్ డబ్ల్యూ ఆర్ ఎస్ లో ఉన్న సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించడానికి కృషి చేస్తానని తెలియజేశారు. గురుకుల పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులు అన్ని రంగాల్లో ముందుండే విధంగా తన శాయ శక్తుల కృషి చేస్తానని, వారికి అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడంతో పాటు వారు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుకునే విధంగా తోడ్పాటును అందజేస్తానని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని గురుకుల పాఠశాలలను సందర్శించి ఆయా పాఠశాలల్లో ఉన్న సమస్యలను గుర్తించి వాటిని ప్రజా ప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడానికి కృషి చేస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కొండ వెంకన్న ప్రధాన కార్యదర్శి బక్కూరి నర్సింగరావు. సురేష్ .కరుణాకర్. జాలిగా నరసింహారావు. సానది నరసింహారావు .అయగల్ల పోచయ్య.రమేష్
టీ జీ పీ ఏ సభ్యులు పాల్గొన్నారు.
