యూరియా కోసం రైతులకు తిప్పలు తప్పడం లేదు. యూరియా కోసం రైతులు సిద్దిపేట జిల్లా తొగుట మండల కేంద్రంలోని సొసైటీ వద్ద పడి కాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంది. తొగుట మండల కేంద్రంతో పాటు, కాన్గల్ గ్రామాల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి శనివారం ఉదయం యూరియా లోడ్ వస్తుందన్న విషయం తెలుసుకున్న ఆ సహకార సంఘ పరిధిలోని రైతులు ఉదయం నుండే యూరియా కోసం మనుషులకు బదులు బీరు సీసాలు, మందు సీసాలు, చెప్పులతో క్యూ లైన్ లో యూరియా కోసం వేచి ఉన్నారు.





