కరీంనగర్ జిల్లా, వీణవంక మండలం, చల్లూరు గ్రామంలో లంచం తీసుకుంటూ ఓ పంచాయతీ కార్యదర్శి ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. నాగరాజు అనే ఈ కార్యదర్శిని పట్టుకోవడంతో గ్రామంలోని ప్రజలు పటాకులు కాల్చి, సంబరాలు జరుపుకున్నారు.
గ్రామంలో కొత్తగా నిర్మించుకున్న ఇంటికి నెంబర్ కేటాయించడానికి నాగరాజు రూ. 20,000 లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధిత వ్యక్తి అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులను ఆశ్రయించాడు. పక్కా ప్రణాళికతో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి, డబ్బులు తీసుకుంటుండగా నాగరాజును పట్టుకున్నారు.





