మంచిర్యాల జిల్లా పదాధికారులను నియమించడం జరిగింది.
మంచిర్యాల జిల్లా.
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు ఆదేశాల మేరకు మంచిర్యాల జిల్లా పదాధికారులను నియమించడం జరిగింది. ఈ జిల్లా కమిటీలో 6 గురు ఉపాధ్యక్షులు, ముగ్గురు ప్రధాన కార్యదర్శులు, ఆరుగురు కార్యదర్శులు, జిల్లా కోశాధికారి, జిల్లా కార్యాలయ కార్యదర్శి, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్, జిల్లా మీడియా కన్వీనర్ మరియు జిల్లా ఐటీ కన్వీనర్ లను నియమించడం జరిగింది. ఈ నియామకం తక్షణం అమలులోకి వస్తుంది.
వీరితోపాటు జిల్లాలో 45 మంది జిల్లా కార్యవర్గ సభ్యులను 10 శాశ్వత జిల్లా ఆహ్వానితులను 10మంది ప్రత్యేక ఆహ్వానితులను నియమించడం జరిగింది. పార్టీకి చాలాకాలంగా పనిచేస్తున్న వారి సేవలను గుర్తించి ఈ నియామకం జరిగిందని అదేవిధంగా కొందరి రాజకీయ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని బాధ్యతలు ఇవ్వడం జరిగింది అన్ని సామాజిక వర్గాలకు. మహిళలకు సరియైనటువంటి ప్రాధాన్యం కల్పించడంజరిగింది. త్వరలోనే జిల్లా మోర్చాల అధ్యక్షులు మోర్చా జిల్లా కమిటీల నియామకం జరుగుతుందని అలాగే అసెంబ్లీ కన్వీనర్లు తదితరుల నియామకాలు ఉంటాయి.
పదాధికారులందరూ పార్టీకి సమయం ఇచ్చి పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని కోరడమైనది.
నగునూరి వెంకటేశ్వర గౌడ్,భారతీయ జనతా పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు.





