నిజామాబాద్ హైదరాబాద్ మార్గంలో కామరెడ్డి జిల్లా బిక్కనూరు వద్ద రైల్వే ట్రాక్ దెబ్బతిన్న కారణంతో పలు రైళ్ల రాకపోకలను సౌత్ సెంట్రల్ రైల్వే నిలిపివేసింది. ఈ మేరకు అధికారిక ప్రకటనను విడుదల చేసింది.రాయలసీమ ఎక్స్ప్రెస్ ను రద్దు చేయగా, నిజామాబాద్ మీదుగా మహారాష్ట్రకు వెళ్లే రైళ్లను కాచిగూడ, కాజీపేట, పెద్దపల్లి, నిజామాబాద్ మీదుగా దారి మళ్లిస్తున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు





