*రామగుండం పోలీస్ కమీషనరేట్*
గణనాధునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన మంచిర్యాల డిసిపి.
*మంచిర్యాల జోన్ ప్రజలకు అధికారులకు సిబ్బందికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన డిసిపి *
రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ మంచిర్యాల పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాత మంచిర్యాల రామాలయం శివాలయం ప్రాంగణంలో గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన వినాయకుడి పూజ కార్యక్రమానికి మంచిర్యాల డిసిపి ఏ భాస్కర్ ఐపీఎస్ గారు అధికారులతో కలిసి పూజా కార్యక్రమానికి నిర్వహించి తీర్థప్రసాదాలు తీసుకున్నారు.
ఈ సందర్భంగా డిసిపి మాట్లాడుతూ…. వినాయకుడు విజ్ఞాలను, బాధలను తొలగించేవాడు ఆదిదేవుడు ఆయన దివ్య ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలన్నారు. గణపతి విగ్రహాల ప్రతిష్టా, ఊరేగింపు సమయంలో, నిమజ్జన సమయంలో కరెంట్ ద్వారా, రోడ్డు ప్రమాదాలు, నీటిలో మునిగిపోయే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. నిర్వాహకులు ఇలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వినాయక మండపాల కి ఉచిత కరెంటును ఇవ్వడం జరుగుతుంది. కావున ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి కాని చట్ట వ్యతిరేకంగా విద్యుత్తు వైర్లను తగిలించి ప్రమాదాల గురికాకూడదు, వర్షాలు కూడా పడుతున్నాయి కనుక షార్ట్ సరిక్యూట్ అయ్యే ప్రమాదం కూడా ఉందని, మండపాల డెకరేషన్ కొరకు లైట్ల ఏర్పాటు కూడా నాణ్యతమైన వైర్లను వాడాలన్నారు. అన్నారు. నిర్వాహకులు పోలీసు వారి వెబ్సైట్లో గణపతి విగ్రహ ఏర్పాటు అనుమతి తీసుకున్నప్పుడు రసీదు రావడం జరుగుతుంది దాని ఆధారంగా సంబంధిత విద్యుత్ శాఖ, లైన్మెన్ కి సమాచారం ఇస్తే వాళ్ళు ఏర్పాట్లు చేస్తారని అన్నారు. ప్రజలు మండపాల నిర్వహకులు అందరూ కూడా పోలీసు వారి సూచనలు పాటిస్తూ ఆనందోత్సవాల మధ్య గణపతి నవరాత్రి ఉత్సవాలు, శోభయాత్ర, నిమజ్జనాలు ప్రశాంతమైన వాతావరణంలో చేసుకోవాలన్నారు. ప్రజలందరూ సోషల్ మీడియాలో వచ్చే వదంతులు పుకార్లపై అప్రమత్తంగా ఉండాలని అపోహలకు గురి కావద్దని, ఏదైనా సమస్య ఉన్న ఏదైనా సమాచారం ఉన్నట్లయితే డయాల్ 100,స్థానిక పోలీసులు సమాచారం అందించాలని తెలిపారు.
డీసీపీ వెంట మంచిర్యాల ఏసిపి ఆర్. ప్రకాష్, మంచిర్యాల పట్టణ ఇన్స్పెక్టర్ ప్రమోదరావు తదితరులు పాల్గొన్నారు.





