Breaking News

వరద నీటిలో చిక్కుకున్న వారి సంరక్షణకు అన్ని సహాయక చర్యలు తీసుకుంటున్నాం

187 Views

 

వరద నీటిలో చిక్కుకున్న వారి సంరక్షణకు అన్ని సహాయక చర్యలు తీసుకుంటున్నాం

ఎస్డిఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సేవలు వినియోగిస్తాం

ప్రజలు ఎవరూ బయటకు రావద్దని, పశువులను మేపడాని తీసుకెళ్ళవద్దని విజ్ఞప్తి

ఎగువ మానేరు ప్రాజెక్టు, లింగన్నపేట మానేరు వాగు వద్ద పరిశీలిస్తున్న ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేస్తున్న జిల్లా కలెక్టర్ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బి గితే ఎగువ మానేరు ప్రాజెక్టు వరద ఉదృతితో అవతలి వైపు చిక్కుకుపోయిన వారి సంరక్షణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బి గీతే తెలిపారు. ప్రాజెక్టు వద్ద చిక్కుకుపోయిన ఐదుగురు, అలాగే లింగన్నపేట వద్ద మానేరు వాగులో చిక్కుకుపోయిన వ్యక్తిని కలెక్టర్, ఎస్పీ పరిశీలించారు.ఈరోజు దాదాపు ఉదయం నుంచి ఇప్పటివరకు ఎగువ మానేరు అలాగే లింగన్నపేట వద్ద కలెక్టర్, ఎస్పీ వరద ప్రవాహాన్ని పరిశీలిస్తున్నారు. నీటి ప్రవాహంలో చిక్కుకున్న వారికి ఇప్పటికే ఆహార పదార్థాలు, నీరు చేరవేశారు. వారిని సురక్షితంగా గమ్యం చేర్చేందుకు కలెక్టర్ ఎస్పీ ఎప్పటికప్పుడు ఏర్పాట్లు చేస్తున్నారు.లింగన్నపేట వద్ద మానేరు వాగులో చిక్కుకుపోయిన వ్యక్తిని కాపాడే విషయమై ఎస్ డీ ఆర్ ఎఫ్ బృందానికి సూచనలు అందజేశారు. ఎన్టీఆర్ బృందం కూడా రానుందని కలెక్టర్, ఎస్పీ తెలిపారు. మానేరు వరదలో చిక్కుకుపోయిన వారి సంరక్షణకు అన్ని చర్యలు తీసుకుంటామని ఎవరూ ఆందోళన చెందవద్దని కలెక్టర్ స్పష్టం చేశారు.ఎగువ ప్రాంతం నుండీ భారీ వర్షము కారణం వల్ల వరద ప్రవాహము ఎక్కువ ఉన్నందున అత్యవసరమైతే తప్ప ప్రజలు ఎవరూ బయటకు రావద్దని, పశువులను మేపడాని తీసుకెళ్ళావద్దని విజ్ఞప్తి చేశారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *