Breaking News

రోడ్డు ప్రమాదంలో… డిఈ ప్రశాంత్ కుమార్ కు తీవ్ర గాయాలు

34 Views

పరామర్శించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

నర్మెట్ట వద్ద ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ పనులు పరిశీలించేందుకు వెళ్తున్న సంబంధిత డిఈ ప్రశాంత్ కుమార్ కు గజ్వేల్ మండలం రిమ్మనగూడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆయనను గజ్వేల్ జిల్లా ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తుండగా, అదే రోడ్డు వెంట వెళ్తున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు సమాచారం అందింది. ఈ మేరకు ఆయన గజ్వేల్ చేరుకొని ప్రశాంత్ కుమార్ ను పరామర్శించారు. అయితే రోడ్డు ప్రమాదంలో చేయి విరిగిందని ఆసుపత్రి సూపరిoడెంట్ అన్నపూర్ణ స్పష్టం చేశారు. దీంతో మెరుగైన వైద్య సేవల నిమిత్తం ప్రశాంత్ కుమార్ ను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హైదరాబాద్ కు సొంత వాహనంలో పంపించారు. అలాగే గాయాల బారిన పడిన ఆయిల్ ఫామ్ అధికారులు శ్రీనివాస్, శ్రీకాంత్, మధుసూదన్ రెడ్డి తదితరులకు ప్రాథమిక చికిత్సలు నిర్వహించి గాంధీ ఆసుపత్రికి తరలించినట్లు డిసిసి అధ్యక్షులు తూoకుంట నర్సారెడ్డి పేర్కొన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్లు నరేందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, విజయ మోహన్, వైస్ చైర్మన్లు సర్దార్ ఖాన్, ప్రభాకర్ గుప్త, నాచగిరి ఆలయ కమిటీ చైర్మన్ రవీందర్ గుప్త, కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ నిమ్మ రంగారెడ్డి, నేతలు మొనగారి రాజు, రాములు గౌడ్, రేగొండ గౌడ్, గాడిపల్లి శ్రీనివాస్, శివారెడ్డి, అజ్గర్, గుంటుకు శ్రీనివాస్, శ్రీనివాసరెడ్డి తదితరులు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెంట ఉన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *