మట్టి గణపతి విగ్రహాలు శ్రేష్టం అని గజ్వేల్ మాజీ ఉపసర్పంచ్ నంగునూరి సత్యనారాయణ అన్నారు, మంగళవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో అభయ హస్తం మిత్రబృందం అధ్యక్షులు గజ్వేల్ మాజీ ఉప సర్పంచ్ నంగునూరి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఉచిత మట్టి గణపతి విగ్రహాలు, పూజా సామాగ్రి అన్ని కలిపి ఒక జ్యూట్ బ్యాగులో ప్రజలకు అందజేసి అనంతరం వారు మాట్లాడుతూ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల వల్ల పర్యావరణానికి హాని కలుగుతుందని మట్టి గణపతి విగ్రహాల వల్ల పర్యావరణానికి మేలు కలుగుతుందని అభయహస్తం మిత్ర బృందం ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాలుగా ఉచిత మట్టి గణపతి విగ్రహాలను అందజేయడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో ఇటిక్యాల తాజా మాజీ సర్పంచ్ అభయ హస్తం మిత్రబృందం అధ్యక్షుడు రావి కంటి చంద్రశేఖర్, కొండపోచమ్మ దేవస్థానం మాజీ డైరెక్టర్ గోలి సంతోష్, నంగునూరి విజయ్, దొంతుల సత్యనారాయణ, కైలాస ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.





