యూరియా అక్రమ రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవు.
జిల్లా సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ ల వద్ద విస్తృతంగా వాహన తనిఖీలు.
యూరియా పంపిణీ కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు.
జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే ఐపిఎస్.
ఈసందర్భంగా ఎస్పీ మహేష్ బి గీతే మాట్లాడుతూ…. జిల్లాలో యూరియా అక్రమ రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, జిల్లా సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ లో సిబ్బంది 24/7 నిరంతరం పగడ్బందీగా అప్రమత్తంగా ఉంటూ వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ నిర్వహిస్తూ యూరియా అక్రమ రవాణా చేసేవారిని పట్టుకోవడం జరుగుతుందన్నారు.రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా యూరియా పంపిణీ కేంద్రాల వద్ద పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. యూరియా ఎరువులు దుర్వినియోగం కాకుండా కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేశామన్నారు.ఎరువుల నియంత్రణ చట్టాన్ని ఉల్లంఘించి అక్రమంగా రవాణా చేస్తే కేసులు నమోదు చేయడం జరుగుతుంది హెచ్చరించారు.





