నేడు దౌలాపూర్ లో గ్రామదేవతల ప్రతిష్ట
సిద్దిపేట జిల్లా ఏప్రిల్ 20
జగదేవ్ పూర్ మండలంలోని దౌలాపూర్ గ్రామంలో ఆదివారం గ్రామదేవతల విగ్రహ ప్రతిష్ట నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గ్రామంలో నూతనంగా దుర్గమ్మ పెద్దమ్మ ఎల్లమ్మ సౌడాలమ్మ, మహంకాలమ్మ, మహా లింగేశ్వర దేవాలయాలు నిర్మించడం జరిగిందని ఆయా దేవాలయాలలో ఆదివారం ఉదయం వేద పండితుల ఆధ్వర్యంలో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు ఇందులో భాగంగా శనివారం ఆయా దేవాలయాల వద్ద గణపతి పూజ పుణ్యాహవాచనము అఖండ దీపారాధన యాగశాల ప్రవేశ కార్యక్రమాలు నిర్వహించామన్నారు. జలాధివాసము ధన్యాదివాసము శయ్యాదివాసము పుష్ప ఫలాదివాసము కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. అంతకుముందు తెల్లవారుజామున గ్రామం చుట్టూ గ్రామస్తులందరి ఆధ్వర్యంలో పులుగం పోయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో నిర్వాహకులు వంటేరు శ్రీనివాస్ రెడ్డి సుధాకర్ రెడ్డి ఉపేందర్ రెడ్డి మధుసూదన్ రెడ్డి యాదవ రెడ్డి ఉప్పల్ రెడ్డి, కృష్ణ పుల్లయ్య జయమ్మ సాయిలు మహిపాల్ రెడ్డి బంగారి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.





