ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో స్కూల్ విద్యార్థులను తీసుకు వెళుతున్న ఆటో బోల్తా పడి మహమ్మద్ హర్షద్ రిజ్వాన్ అనే విద్యార్థి తీవ్రంగా గాయపడ్డ సంఘటనలో విద్యార్థి తల్లి మహమ్మద్ షబానా బేగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆటో డ్రైవర్ షేక్ మాలాన్ పై కేసు నమోదు చేసినట్లు ఎల్లారెడ్డిపేట ఎస్ ఐ కె.రాహుల్ రెడ్డి తెలిపారు.
ఎస్ ఐ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఎల్లారెడ్డిపేట మండలంలోని బొప్పాపూర్ గ్రామానికి చెందిన షేక్ మలాన్ తన ఆటోలో బొప్పాపూర్ గ్రామానికి చెందిన విద్యార్థులను ఎల్లారెడ్డిపేట లోని విజ్ఞాన్, శ్రీ చైతన్య ప్రైవేటు పాఠశాలలకు తీసుకు వెళ్లి తీసుకు వస్తుంటాడు.
ప్రతి రోజులాగా విద్యార్థులను తన ఆటోలో ఎక్కించుకొన్న షేక్ మలాన్ కొందరు విద్యార్థులను శ్రీ చైతన్య స్కూల్ లో వదిలి హర్షద్ రిజ్వాన్ తో పాటు మరికొందరు విద్యార్థులను విజ్ఞాన్ స్కూల్ లో విడిచి పెట్టుటకు ఆటోను అతి వేగంగా,అజాగ్రత్తగా నడిపి ఆటో బోల్తా ప్రమాదానికి కారకుడు అయ్యాడని ,ఈ ప్రమాదంలో హర్షద్ రిజ్వాన్ కుడి కాలుకు బలమైన గాయాలు కావడము తో పాటు మరికొందరు విద్యార్థులకు గాయాలు కావడానికి కారకుడు అయ్యాడని
మహమ్మద్ షబానా బేగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆటో డ్రైవర్ షేక్ మలాన్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ ఐ రాహుల్ రెడ్డి తెలిపారు.
