రాజన్న సిరిసిల్ల జిల్లా లోని స్వర్ణకారులందరూ బంగారం ధరలు ఆకాశాన్ని అంటడంతో స్వర్ణవృత్తుదారులు పనులు లేక విలవిలలాడుతున్నారు వెండి బంగారం కస్టమర్లు ఆర్డర్ ఇచ్చి ఎంతో కొంత అడ్వాన్స్ ఇచ్చి పోతే బంగారం కొందామంటే ఈరోజు ఉన్న రేటు రేపు ఉండట్లేదు అంటూ స్వర్ణకారులు విలవిలలాడుతున్నారు అంతేకాకుండా ఒకప్పుడు దగ్గరి బంధువుల పెండ్లి లు జరిగిన వారికి అద్దతులం బంగారం భటువు (ఉంగరం) పెట్టేవారు అప్పట్లో అర తులం బంగారానికి 15,000 నుంచి 20వేల రూపాయల వరకు ఉండేది దానిని కొని పెట్టాలన్న వారికి అతి ఉత్సాహం కూడా ఉండేది కానీ ఇప్పుడు అర తులం బంగారం కొనాలి అంటే 50వేల పైచిలుకు రూపాయలు కావాలి అలాంటప్పుడు అర్థతులం బంగారం పెట్టాలని కస్టమర్లు కూడా అనుకోవడం లేరు అంతే కాకుండా ఈ బంగారం ధరలు మిన్నంటి పోవడం వల్ల మా స్వర్ణకారులకు తినడానికి తిండి లేకుండా పోయే కుటుంబాలు ఎన్నో ఎవరో స్వర్ణకారులలో 100 మందిలో ఐదు శాతం మంది ఆర్థికంగా ఉండి పెట్టుబడి పెడితే 95% మంది కస్టమర్లు ఇచ్చిన ఆర్డర్ పై పెట్టుబడి లేక బంగారం ధరలు మిన్నంతటముతో దానిని కస్టమర్ల దగ్గర నుంచి ఆర్డర్లు తీసుకులేకపోతున్నారు అంతేకాకుండ ఒకప్పుడు గ్రామాలలో పెండ్లిల్లు మరియు ఏదన్నా ఇండ్లలో ఫంక్షన్లో జరుపుకుంటే స్థానిక స్వర్ణకారునికి డిజైన్ కు సంబంధించిన క్యాటలాకులను చూసి ఆర్డర్ ఇచ్చి చేయించుకునేవారు కానీ ఇప్పుడు కార్పొరేట్ జ్యువలరీ మొగ్గు చూపెడుతున్నారు వారు బంగారంపై 22 క్యారెట్ ధర చెప్పి కస్టమర్లకు మాయ మాటలు చెప్పి 22 క్యారెట్ పైన అధికంగా వస్తువు తయారీకి సంబంధించి 15% నుండి 20% వరకు (వి. ఏ) తరుగు రూపేనా మరియు జిఎస్టి 3% రూపేనా మొత్తం 23% కస్టమర్ పైనే భారం మోపుతున్నారు అంటే 92+23 శాతం కలిపితే 115% వరకు కస్టమర్లపై కార్పొరేట్ జ్యువెలర్స్ జిమ్మిక్కులు, మాయాజాలాలు ఏర్పడటం లేదు కస్టమర్లు 22 క్యారెట్ ధరకు అలవాటు పడి కస్టమర్లు కార్పొరేట్ జవెల్లర్లపై మొగ్గు చూపెడుతున్నారు అదే బంగారం వర్తకుని దగ్గరికి అంటే స్వర్ణకారుని దగ్గరికి వచ్చి అదే చుక్క 24 క్యారెట్ల బంగారం ఇచ్చి ఏదేని వస్తువు ఇచ్చి ఆర్డర్ ఇస్తే దానికి 3% నుండి 5% వరకు పరుగు తీసుకుంటామని కార్పొరేట్ జువెలరీ షాపులకు మా దగ్గరకి 10 శాతం వరకు కస్టమర్లకు ఆదా అవుతుంది స్వర్ణకారుల దగ్గరే చేయించుకుంటే మంచిది అని స్వర్ణకారులు చెబుతున్నారు మరియు ఏదేని రిపేర్ వస్తే స్వర్ణకారులు ఎలాంటి చార్జీలు లేకుండా దానికి ఎంత అయితే బంగారం పడుతుందో అంత బంగారం డబ్బులే తీసుకుంటారు కానీ కార్పొరేట్ జ్యువెలర్స్ ఆ వస్తువును రిటర్న్ తీసుకుని కొత్త వస్తువుకు( వి.ఏ)లు జీఎస్టీలు వర్తింప చేస్తాడు కాబట్టి కస్టమర్లు కూడా మా స్వర్ణకారుల పరిస్థితిని ఆలోచించి స్వర్ణకారుల దగ్గరే వస్తువులు చేయించుకోవాలని దీనివల్ల తరతరాలుగా చేస్తున్న స్వర్ణకారుల వృత్తినే కాపాడాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా స్వర్ణకారులపై చొరవ చూపించి స్వర్ణకార కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని గ్రేటర్ మున్సిపాలిటీలో తప్ప గ్రామపంచాయతీ లలో ఇతర కులస్తుల జువెలరీ షాపులు ఏర్పాటు చేయకుండా ప్రభుత్వం చూసుకోవాలని కార్పొరేట్ జ్యువెలరీ షాపులను కూడా పల్లెల్లో ఏర్పాటు చేయకుండా ప్రభుత్వం దీనిపై బాధ్యత వహించాలని కులవృత్తులను కాపాడాలని రాబోయే తరంలో కులవృత్తులు కనుమరుగైపోయి స్వర్ణకారులు ఆత్మహత్యలు చేసుకునే రోజులు కూడా దగ్గర పడుతాయని దీనికిగాను స్వర్ణకారులకు పెట్టుబడికిగాను ప్రభుత్వం ఆదుకొని సహాయ సహకారాలు అందించాలని విజన్ ఆంధ్రా తెలుగు దినపత్రికతో స్వర్ణకారులు వారి బాధను వెళ్ళబుచ్చుకున్నారు
