రాజన్న సిరిసిల్ల జిల్లా:ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ వారు ఈ కార్యక్రమాన్ని ప్రతి గ్రామాల్లో నిర్వహించాలని ఆదేశించగా శనివారం రోజున బొప్పాపూర్ గ్రామంలో అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, ఆశ వర్కర్లు ఐదు సంవత్సరాలలోపు పిల్లలకు పౌష్టికాహారం అందాలనే ఉద్దేశంతో రాగి లడ్డులు పంపిణీ చేశారు, గ్రామంలో సుమారు 70 మంది పిల్లలకు రాగి లడ్డులు పంపిణీ చేశారు తులసమ్మ మాట్లాడుతూ.. పోషకాహార విలువలను వివరించుతూ చిరుధాన్యాల ఆవశ్యకత, పోషకాహారం పై అవగాహన, వయసుకు తగ్గ పిల్లలు బరువు ఎత్తు పెరగాలి అంటే సరైన పోషకాహారంతోపాటు సీజనల్గా వచ్చే పండ్లు ఆకుకూరలు, కూరగాయలు మరియు పరిశుభ్రమైన నీరు అందించాలని వివరించారు ఇట్టి కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ ప్యాట తులసమ్మ, ముప్పవరం పద్మ, ముప్పవరం వెంకటమ్మ, అందిపల్లి హంస, నీరటి భవాని, ఆయాలు, ఆశా వర్కర్లు సుజాత, దేవేంద్ర, బొప్పాపూర్ గ్రామ సర్పంచ్ కొండాపురం బాల్రెడ్డి, ఎంపిటిసి ఇల్లందుల గీతాంజలి – శ్రీనివాస్, ఉపసర్పంచ్ వంగ హేమలత-బాపురెడ్డి గ్రామస్తులు పాల్గొన్నారు
