Breaking News

శామీర్ పేటలో ఓ ఆర్ ఆర్‌ రింగ్ రోడ్డు పై ఘోర రోడ్డు ప్రమాదం

152 Views

*శామీర్ పేటలో ఓ ఆర్ ఆర్‌ రింగ్ రోడ్డు పై ఘోర రోడ్డు ప్రమాదం*

హైదరాబాద్ :జులై 17

శామీర్ పేట ఓఆర్ఆర్‌పై నేటి తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

ఔటర్ రింగ్ రోడ్డుపై లియోనియా రిసార్ట్ వద్ద లారీ అదుపు తప్పి డివైడర్ దాటి ఒక కారుతో పాటు మరో వాహనాన్ని ఢీకొట్టింది. కారులో ముగ్గురు వ్యక్తులు ఉండగా అందులో ఇద్దరు మృతి చెందగా.. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి.

ఇక లారీలో ఉన్న ఇద్దరు వ్యక్తులలో క్లీనర్ మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మేడ్చల్ నుంచి కీసర వెళ్తున్న లారీ వాహనాలను ఢీ కొని చెట్ల పొదల్లోకి దూసుకెళ్లింది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు నిర్వహిస్తున్నారు

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *