ఎల్లారెడ్డిపేట మండలంలో మద్యం తాగి వాహనాలు నడిపిన 20మందిని మంగళవారం రోజున కోర్టులో సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్, సిరిసిల్ల జయశ్రీ ముందు హాజరు పరచగా మద్యం సేవించి వాహనాలు నడిపిన 16 ద్విచక్ర వాహనదారులకు, 01 ఆటో 3 కార్ నడిపిన వ్యక్తులకు జరిమానా విధించారు. వాహనాదారులు మద్యం సేవించి వాహనాలు నడిపిన బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగిన అట్టి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎల్లారెడ్డిపేట ఎస్సై కె . రాహుల్ రెడ్డి తెలిపినారు.
