*రామగుండం పోలీస్ కమీషనరేట్*
సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్స్ తో తప్పుడు పోస్టులు పెట్టిన వ్యక్తి అరెస్ట్.
సోషల్ మీడియాను దుర్వినియోగపరిస్తే చర్యలు తప్పవు.
సామాజిక మాధ్యమాలపై ప్రత్యేక నిఘా గోదావరిఖని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి.
గోదావరిఖని పోలీస్ స్టేషన్ పరిధిలో తేదీ 29-6-25 రోజున ఒక వ్యక్తి *”రామగుండం జనహిత, పాలకుర్తి మండలం, నిజం నిప్పులాంటిది “* అను మూడు ఫేస్బుక్ అకౌంట్లను క్రియేట్ చేసి దానిలో మహంకాళి స్వామి మాజీ కార్పొరేటర్ ను కించపరిచే విధంగా వీడియోలను పెట్టినాడని తన దరఖాస్తు మేరకు గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి అట్టి పోస్టులకు సంబంధించి విచారణ చేసి టెక్నాలజీ సహాయంతో ఆ సోషల్ మీడియా గ్రూపులను క్రియేట్ చేసిన వ్యక్తిని పట్టుకోవడం జరిగింది అట్టి సోషల్ మీడియా గ్రూప్ క్రియేట్ చేసిన అతని యొక్క ఫోను సీజ్ చేయడం జరిగింది అతనిని అరెస్టు చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది.
సోషల్ మీడియా గ్రూపులో పోస్ట్లు పెట్టిన నిందితుని పేరు జరుపుల శ్రీనివాస్ s/o నరసింహ, 36 సంవత్సరాలు, వృత్తి: కూలి పని నివాసము : ఎస్టి కాలనీ, రామగుండం.
ఇతడు గతంలో ఆఫ్ టిప్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ నెట్వర్క్ ప్రైవేటు కంపెనీలు జాబ్ చేసేవాడు తర్వాత కొద్ది రోజులు పొలిటికల్ పార్టీలో యాక్టివ్ గా పని చేసినాడు అతని ఆరోగ్యం సరిగా లేనందున 2023 నుంచి పొలిటికల్ గా స్తబ్దతగా ఉంటూ ఇంట్లోనే సోషల్ మీడియా గ్రూపులను ఆపరేట్ చేసుకుంటూ అప్పుడప్పుడు కూలి పని చేస్తూ జీవిస్తున్నాడు. తన వ్యక్తిగత కారణాలవల్ల అనవసరమైన పోస్టులు పెడుతూ రెండు పొలిటికల్ పార్టీల మధ్య గొడవ సృష్టించి, వ్యక్తిగతన దూషణలకు ఘర్షణలకు వాగ్వాదాలకు దారితిస్తూ, ప్రశాంతమైన వాతావరణంలో జీవిస్తున్న ప్రజల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నందున అతనిపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతున్నది.
పోలీస్ శాఖ తరపున ప్రజలందరికీ విజ్ఞప్తి.. సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తూ విద్వేషపూరిత ప్రసంగాలు ఏదైనా ఒక వర్గం వారిని రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలతో పోస్టులు పెట్టటం, ఒక వ్యక్తి వర్గం రాజకీయ పార్టీ గురించి అసభ్య పదజాలం ఫోటోలు పెట్టిన, ఎవరైనా పొలిటికల్ పార్టీ వాళ్లు కులాలకు సంబంధించి, మతాలకు సంబంధించి ఏదైనా అసభ్యకరమైన ఫోటోలు వీడియోలు మార్నింగ్ చేసి పెట్టిన, కించపరిచే విధంగా మాట్లాడిన, మెసేజ్లు ఫార్వర్డ్ చేసిన పెట్టిన చట్ట ప్రకారం వారి పైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో మరింత కఠినంగా వ్యవహరిస్తామని తెలియజేస్తూ ఇలాంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడద్దని సోషల్ మీడియా గ్రూపులను మంచికి మాత్రమే సమాచారం చేరవేయడం కోసం మాత్రమే ఉపయోగించాలి తప్ప ఇతరులను ఇబ్బంది పెట్టే విధంగా సోషల్ మీడియా గ్రూపులను ఉపయోగించరాదని, అదేవిధంగా అసత్య సమాచారాన్ని పోస్ట్ చేసిన వ్యక్తితో పాటు ఫార్వర్డ్ చేసే వ్యక్తులపై కూడా చట్టబరమైన చర్యలు తీసుకొని కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తామన్నారు. ఇట్టి విషయం ను ప్రజలు గమనించగలరు అని విజ్ఞప్తి చేస్తున్నాం.
వన్ టౌన్ ఇన్స్పెక్టర్ గోదావరిఖని వన్ టౌన్.
