రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణం తిప్పాపురంలో ఘోర సంఘటన చోటు చేసుకుంది. ఆస్తి పంపకాల కోసం వృద్ధ దంపతులు అయినటువంటి తల్లిదండ్రులను కొడుకులు నడిరోడ్డున తాళ్లతో బంధించి కన్న పేగుబంధం మరచిన కన్న కొడుకులు. పోలీసుల వివరాల ప్రకారంతిప్పాపురం గ్రామానికి చెందిన ఓ వృద్ధ తల్లిదండ్రులు కొడుకులకు ఇవ్వాల్సిన వాటాను బిడ్డ కుమారునికి ఇస్తున్నారనే అనుమానంతో మంగళవారం రాత్రి ఆ వృద్ధ దంపతుల ఇంటికి వెళ్లి తీవ్ర వాగ్వాదానికి దిగి తల్లిదండ్రులను వరుసకు మేన అల్లునితో సహా రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభానికి తాళ్లతో కట్టేశారు. స్థానికులు ఆ అగైత్యాన్ని చూసి ఇదేంటి అని కొడుకులు ప్రశ్నిస్తే మీకు ఏమైనా సినిమా లాగా ఉందా….? అంటూ కొడుకులు స్థానికులకు బెదిరింపులకు గురి చేశారు.పోలీసులు వెంటనే వారి ఇరువురిని పోలీస్ స్టేషన్కు పిలిపించి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
