మంచిర్యాల జిల్లా.
సింగరేణి స్థలాల్లో ఉంటున్న వారికి శాశ్వత నివాస ఇండ్ల పట్టాలు ఇవ్వాలి : బిజెపి.
నస్పూర్ సింగరేణి స్థలాల్లో శాశ్వత నివాసం ఉంటున్న వారికి ఇండ్ల పట్టాలు ఇవ్వాలని కోరుతూ ఈరోజు పట్టభద్రుల ఎమ్మెల్సీ చిన్నమైల్ అంజి రెడ్డి మరియు బీజేపీ రాష్ట్ర నాయకులు రఘునాథ్ వెరబెల్లి సింగరేణి సి & ఎండి శ్రీ బలరాం నాయక్ ని కలిసి మెమోరాండం అందించడం జరిగింది.
నస్పూర్ పట్టణంలోని ఆర్కే 6, కొత్త రోడ్ మరియు కృష్ణ కాలనీ లో వేల కుటుంబాలు అనేక సంవత్సరాలుగా సింగరేణి స్థలాల్లో శాశ్వతంగా నివాసం ఉంటున్నాయని మున్సిపాలిటీకి పన్ను కూడా చెల్లిస్తున్న ఇప్పటి వరకు వారికి ఇండ్ల పట్టాలు అందించలేదని వివరించారు. త్వరగా అర్హులైన ప్రతి ఒక్కరికి పట్టాలు అందించాలని కోరారు. ఈ విషయం పై సి & ఎండీ సానుకూలంగా స్పందించారు.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ మాజీ వైస్ ఛైర్మన్ గాజుల ముఖేష్ గౌడ్ గ పాల్గొన్నారు.
